NIPER Admissions: ఉన్న‌త ఫార్మ‌సీ విద్య‌కు నైప‌ర్‌ ప్ర‌వేశ ప‌రీక్ష‌.. ద‌ర‌ఖాస్తులు ఇలా..!

ఫార్మసీలో ఉన్నత విద్యకు ఉత్తమ వేదికలు.. నైపర్‌ క్యాంపస్‌లు! ఫార్మా కోర్సులను అందించడంలో అంతర్జాతీయ గుర్తింపు పొందిన ఈ ఇన్‌స్టిట్యూట్స్‌లో పీజీ, పీహెచ్‌డీ పూర్తి చేస్తే..ఉజ్వల కెరీర్‌ అవకాశాలు సొంతం చేసుకోవచ్చు..

సాక్షి ఎడ్యుకేష‌న్‌: నైపర్‌లో ప్రవేశం పొందాలంటే.. నైపర్‌–జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌లో స్కోర్‌ సాధించాల్సి ఉంటుంది!! తాజాగా 2024 విద్యా సంవత్సరానికి సంబంధించి నైపర్‌–జేఈఈ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో.. నైపర్‌ జేఈఈకి అర్హతలు, పరీక్ష విధానం, బెస్ట్‌ స్కోర్‌కు మార్గాలు, పీజీ స్పెషలైజేషన్స్, భవిష్యత్తు అవకాశాలపై ప్రత్యేక కథనం.. 

ఫార్మా రంగంలో నాణ్యమైన ఉన్నత విద్యను అందించాలనే లక్ష్యంతో నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మాస్యుటికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌(నైపర్‌) క్యాంపస్‌లను ఏర్పాటు చేశారు. ఈ విద్యాసంస్థలు ఇండస్ట్రీ, రీసెర్చ్‌ ల్యాబ్స్‌తో ఒప్పందాల ద్వారా ప్రా­క్టికాలిటీకి ప్రాధాన్యమిస్తూ .. ఎంఫార్మసీ, పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లు అందిస్తున్నాయి. ఆయా కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రతి ఏటా నైపర్‌–జేఈఈ నిర్వహిస్తున్నారు.

High Court: దక్కన్‌ కాలేజీ కాల్పుల కేసులో హైకోర్టు తీర్పు.. ఏకంగా పదేళ్ల జైలు శిక్ష!

ఏడు క్యాంపస్‌లు.. 990 సీట్లు
దేశ వ్యాప్తంగా ప్రస్తుతం ఏడు నైపర్‌ క్యాంపస్‌లు ఉన్నాయి. వాటిలో ఎంఫార్మసీ, ఎంటెక్, ఎంబీఏ స్థాయిల్లో మొత్తం 990 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

కోర్సులు–స్పెషలైజేషన్లు

  •     మాస్టర్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఫార్మసీ)–మెడిసినల్‌ కెమిస్ట్రీ, నేచురల్‌ ప్రొడక్ట్స్, ట్రాడిషనల్‌ మెడిసిన్, ఫార్మాస్యూటికల్‌ అనాలసిస్, ఫార్మకాలజీ అండ్‌ టాక్సికాలజీ, రెగ్యులేటరీ టాక్సికాలజీ, ఫార్మస్యూటిక్స్, ఫార్మకోఇన్ఫర్మాటిక్స్, రెగ్యులేటరీ అఫైర్స్‌.
  •     మాస్టర్‌ ఆఫ్‌ ఫార్మసీ (ఎంఫార్మ్‌)–ఫార్మాస్యూటికల్‌ టెక్నాలజీ(ఫార్ములేషన్స్‌), ఫార్మసీ ప్రాక్టీస్, క్లినికల్‌ రీసెర్చ్‌.
  •     మాస్టర్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఫార్మసీ)–బయోటెక్నాలజీ/ఫార్మాస్యూటికల్‌ టెక్నాలజీ (బయోటెక్నాలజీ), ఫార్మాస్యూటికల్‌ టెక్నాలజీ(ప్రాసెస్‌ కెమిస్ట్రీ/మెడిసినల్‌ కెమిస్ట్రీ), మెడికల్‌ డివైసెస్‌. 
  •     మాస్టర్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌(ఫార్మసీ)– ఫార్మాస్యూటికల్‌ మేనేజ్‌మెంట్‌. 

అర్హతలు

  •     నైపర్‌–జేఈఈ (పీజీ): సదరు పీజీ ప్రోగ్రామ్‌ను అనుసరించి బీఫార్మసీ/బీవీఎస్‌సీ /ఎంబీబీఎస్‌/బీడీఎస్‌/బీటెక్‌ (బయో టెక్నాలజీ)/ఎమ్మెస్సీ తత్సమాన కోర్సులో 6.75 సీజీపీఏ లేదా అంతకు సమానమైన పర్సంటేజీతో ఉత్తీర్ణత సాధించాలి. దీంతోపాటు జీప్యాట్‌/గేట్‌/నెట్‌లో అర్హత సాధించాలి. అర్హత కోర్సు చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. 
  •     నైపర్‌–జేఈఈ(పీహెచ్‌డీ): ఆయా విభాగాలను అనుసరించి ఎంఎస్,ఎంఫార్మసీ, ఎంటెక్‌ కోర్సు లను సదరు స్పెషలైజేషన్లతో 6.75 సీజీపీఏతో ఉత్తీర్ణత సాధించాలి. ఎస్‌సీ, ఎస్‌టీ కేటగిరీ అభ్యర్థులు 6.25 సీజీపీఏ లేదా 55 శాతం మార్కుల­తో ఉత్తీర్ణత సాధిస్తే సరిపోతుంది. దీంతోపాటు జీప్యాట్‌/గేట్‌/సీఎస్‌ఐఆర్‌–యూజీసీ నెట్‌లో అర్హత సాధించాలి. ఎండీ, ఎంవీఎస్‌సీ, ఎండీఎస్, ఫార్మ్‌–డి ఉత్తీర్ణులకు జీప్యాట్‌/నెట్‌/గేట్‌ నిబంధన నుంచి మినహాయింపు లభిస్తుంది.

Supplementary Examinations: ‘మెగా సప్లిమెంటరీ’ నోటిఫికేషన్‌ విడుదల.. డిగ్రీలో ఫెయిల్‌ అయినవారికి మరో ఛాన్స్‌


200 మార్కులకు పరీక్ష
ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించే నైపర్‌ జేఈఈ పరీక్ష 200 మార్కులకు ఉంటుంది. ఇందులో మొత్తం ప్రశ్నలు 200 ఉంటాయి. పరీక్షను రెండు సెక్షన్లుగా నిర్వహిస్తారు. సెక్షన్‌–ఎలో 50 ప్రశ్నలు జీకే, జనరల్‌ ఇంగ్లిష్, ఆప్టిట్యూడ్, రీజనింగ్‌ అంశాల నుంచి అడుగుతారు. సెక్షన్‌–బిలో 150 ప్రశ్నలు బీఫార్మసీ లేదా ఎంఫార్మసీకి సంబంధించి ఉంటాయి. పూర్తిగా ఆబ్జెక్టివ్‌ విధానంలో నిర్వహించే ఈ పరీక్షలో మెరుగైన ర్యాంకు పొందాలంటే.. అభ్యర్థులు బీఫార్మసీ స్థాయిలోని అకడమిక్స్‌పై పూర్తి స్థాయి పట్టు సాధించాలి. కెమిస్ట్రీ, ఫార్మకాలజీ, బయో టెక్నాలజీ, ఫార్మాస్యుటికల్‌ అనాలిసిస్‌ విభాగాలపై ఎక్కువ దృష్టి పెట్టాలి. మొత్తం 200 ప్రశ్నల్లో 70 శాతం మేర ప్రశ్నలు ఈ విభాగాల నుంచే అడుగుతున్నారు. కొన్ని ప్రశ్నలు జనరల్‌ ఆప్టిట్యూడ్‌కు సంబంధించినవి ఉంటున్నాయి.

ఎంబీఏకు జీడీ/పీఐ
నైపర్‌ క్యాంపస్‌లలో ఎంబీఏ ఫార్మా మేనేజ్‌మెంట్‌ కోర్సులో ప్రవేశానికి నైపర్‌ –జేఈఈలో ఉత్తీర్ణతతోపాటు గ్రూప్‌ డిస్కషన్, పర్సనల్‌ ఇంటర్వ్యూలోనూ రాణించాల్సి ఉంటుంది. నైపర్‌–జేఈఈకి 85 శాతం వెయిటేజీ; గ్రూప్‌ డిస్కషన్, పర్సనల్‌ ఇంటర్వ్యూ రెండింటికీ కలిపి 15 శాతం వెయిటేజీ ఇస్తారు.

Good News for TET Candidates: ఉచితంగా TETపై ప్రత్యక్ష ప్రసారాలు, 200 ఎపిసోడ్స్‌ డొమైన్‌లో అందు బాటులో..

ఉమ్మడి కౌన్సెలింగ్‌
నైపర్‌–జేఈఈలో నిర్దేశిత కటాఫ్‌ మార్కులు పొందిన అభ్యర్థులకు ఉమ్మడి కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. ప్రతి ఏటా ఒక క్యాంపస్‌ నైపర్‌–జేఈఈని నిర్వహిస్తుంది. ఆ క్యాంపస్‌ ఆధ్వర్యంలోనే ఉమ్మడి కౌన్సెలింగ్‌ జరుగుతుంది. అందుబాటులో ఉన్న సీట్లు, కటాఫ్‌ మార్కులు తదితరాల ఆధారంగా ప్ర­వేశ జాబితా రూపొందిస్తారు. ఎంపికైన అభ్యర్థులు నిర్దేశిత గడువులోపు తమకు సీటు లభించిన క్యాంపస్‌లో జాయినింగ్‌ రిపోర్ట్‌ ఇవ్వాల్సి ఉంటుంది.

స్టయిఫండ్‌
నైపర్‌–జేఈఈ స్కోర్‌ ఆధారంగా ప్రవేశం ఖరా­రు చేసుకున్న అభ్యర్థులకు నైపర్‌ క్యాంపస్‌లు ఆర్థిక ప్రోత్సాహకాలను అందిస్తున్నాయి. పీజీ కోర్సుల్లో ప్రవేశం పొందిన వారికి నెలకు రూ.12,400 స్టయిఫండ్‌ లభిస్తుంది. ఈ స్టయిఫండ్‌ కొనసాగాలంటే.. ప్రతి సెమిస్టర్‌లోనూ తప్పనిసరిగా జీపీఏ ఆరు పాయింట్లు ట్రాక్‌ రికార్డ్‌ను కొనసాగించాలి. 

ముఖ్య సమాచారం

  •     ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: 2024, మే 24
  •     హాల్‌ టికెట్‌ డౌన్‌లోడ్, పరీక్ష తేదీ: ఇంకా వెల్లడించలేదు
  •     పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://niperguwahati.ac.in/niperjee

 Job Layoffs: ఎలాన్ మస్క్ నేతృత్వంలోని టెస్లా కంపెనీలో కొనసాగుతున్న ఉద్యోగాల కోతలు!!


నైపర్‌ జేఈఈ– పీహెచ్‌డీ
నైపర్‌ క్యాంపస్‌లలో పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రవేశానికి ప్రత్యేకంగా ఎంట్రన్స్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. అభ్యర్థులు నైపర్‌ –జేఈఈ ఆన్‌లైన్‌ దరఖాస్తును పూర్తి చేసేటప్పుడే పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

పీహెచ్‌డీ ప్రవేశ పరీక్ష
పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి నిర్వహించే నైపర్‌–జేఈఈ పరీక్ష ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహిస్తారు. ఇందులో 170 ప్రశ్నలు–85 మార్కులు ఉంటాయి. కెమికల్‌ సైన్సెస్, బయలాజికల్‌ సైన్సెస్, ఫార్మాస్యుటికల్‌ సైన్సెస్‌ విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష వ్యవధి రెండు గంటలు.

మలిదశలో ఇంటర్వ్యూ
ఎంట్రెన్స్‌లో పొందిన స్కోర్‌ ఆధారంగా మెరిట్‌ జాబితా రూపొందిస్తారు. ఈ జాబితాలో నిలిచిన వారికి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇంటర్వ్యూకు కేటాయించిన మార్కులు 15. ఇందులో అభ్యర్థులకు సదరు స్పెషలైజేషన్‌లో పరిశోధనల పట్ల ఉన్న ఆసక్తి, భవిష్యత్తు లక్ష్యాలు తదితరాలను పరిశీలిస్తారు. ఇందులోనూ విజయం సాధిస్తే పీహెచ్‌డీలో ప్రవేశం లభిస్తుంది.

AP Gurukulam 2024 Results: గురుకుల ప్రవేశ పరీక్ష ఫలితాలు వెల్లడి.. రిజల్ట్స్‌ ఇలా చూసుకోండి

సీటు పొందితే.. స్టయిఫండ్‌
పీహెచ్‌డీలో ప్రవేశాలకు ఎంపికైన అభ్యర్థులకు మొదటి రెండేళ్లు నెలకు రూ.31 వేలు చొప్పున; మూడు, నాలుగేళ్లు నెలకు రూ.35 వేలు చొప్పున ఆర్థిక ప్రోత్సాహకం లభిస్తుంది. దీంతోపాటు హెచ్‌ఆర్‌ఏ కూడా అందుతుంది.

బెస్ట్‌ స్కోర్‌ సాధించాలంటే
కోర్‌ సబ్జెక్ట్‌లకు సంబంధించి బీఫార్మసీలో పొందిన నైపుణ్యం పరీక్షలో బెస్ట్‌ స్కోర్‌కు దోహదపడుతుంది. అదేవిధంగా జీప్యాట్‌ కోసం కొనసాగించిన సన్నద్ధత సైతం పరీక్షలో రాణించేందుకు ఉపయోగపడుతుంది. ఫార్మకాలజీలో రిసెప్టర్స్,వాటి రకాలు, మెకానిజమ్‌ ఆఫ్‌ యాక్షన్, ఔషధాల వర్గీకరణ, క్లినికల్‌ ట్రయల్స్‌పై అవగాహన, ప్రీ–క్లినికల్‌ ట్రయల్స్‌ అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలి. డ్రగ్‌ డిస్కవరీకి సంబంధించి ముఖ్యంగా వాటి ప్రాముఖ్యతలు, రియాక్షన్స్‌పై అవగాహన ఏర్పరచుకోవాలి. 

Adjunct Assistant Professor Posts: ట్రిపుల్‌ ఐటీలో అడ్జంక్ట్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు

#Tags