Free Training: స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థలో ఉపాధి కోర్సుల్లో ప్రవేశాలు.. ఎంపికైన అభ్యర్థులకు ఉచిత శిక్షణ, భోజనం, వసతి

యాదాద్రి భువనగిరి జిల్లా జలాల్‌పూర్‌ గ్రామంలో స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ.. ఉపాధి ఆధారిత సాంకేతిక శిక్షణ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. తెలంగాణ రాష్ట్ర గ్రామీణ ప్రాంత అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు ఉచిత శిక్షణ, భోజనం, వసతి కల్పిస్తారు.

ఉపాధి కోర్సుల వివరాలు
బేసిక్‌ కంప్యూటర్స్‌(డేటా ఎంట్రీ ఆపరేటర్‌): 
కోర్సు వ్యవధి: 3 నెలలు. 
అర్హత: ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులవ్వాలి.
అకౌంట్స్‌ అసిస్టెంట్‌(ట్యాలీ): 
కోర్సు వ్యవధి: 3 నెలలు. 
అర్హత: బీకాం ఉత్తీర్ణులవ్వాలి.
కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌ సాఫ్ట్‌వేర్‌: 
కోర్సు వ్యవధి: 3 నెలలు. 
అర్హత: ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులవ్వాలి.
ఆటోమొబైల్‌–టూ వీలర్‌ సర్వీసింగ్‌: 
కోర్సు వ్యవధి: 3 నెలలు. 
అర్హత: పదో తరగతిæ ఉత్తీర్ణులవ్వాలి.
సెల్‌ఫోన్‌–ఎలక్ట్రానిక్‌ డివైజ్‌ రిపేర్‌: 
కోర్సు వ్యవధి: 4 నెలలు. 
అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి.
ఎలక్ట్రీషియన్‌(డొమెస్టిక్‌): 
కోర్సు వ్యవధి: 5 నెలలు. 
అర్హత: పదో తరగతి, ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి.
సోలార్‌ సిస్టమ్‌ ఇన్‌స్టాలేషన్‌/సర్వీస్‌: 
అర్హత: పదో తరగతి, ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి.
గ్రామీణ అభ్యర్థులై ఉండాలి. చదువు మధ్యలో ఉన్నవారు అర్హులు కాదు.
వయసు: 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆసక్తి ఉన్న అభ్యర్థులు అర్హత కలిగిన ఒరిజనల్‌ సర్టిఫికేట్‌లు, జిరాక్స్‌ సెట్, పాస్ట్‌పోర్ట్‌ ఫోటోలు, ఆధార్‌కార్డు, రేషన్‌ కార్డులతో సంస్థ చిరునామాకు సంప్రదించాలి.

సంస్థ చిరునామ: స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ, జలాల్‌పూర్‌(గ్రామం), పోచంపల్లి(మండలం), యాదాద్రి భువనగిరి జిల్లా.

సంస్థలో ప్రవేశాలు: 15.04.2024 ఉదయం 10 గంటలకు

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://www.srtri.com/

#Tags