Skip to main content

Admissions in APTWREIS: ఏపీ ఏకలవ్య మోడల్‌ గురుకుల విద్యాలయాల్లో బ్యాక్‌లాగ్‌ సీట్లలో ప్రవేశాలు.. ఎవరు అర్హులంటే..

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (ఏపీటీడబ్ల్యూఆర్‌ఈఐఎస్‌).. ఏకలవ్య ఆదర్శ గురుకుల విద్యాలయాల్లో 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆరో తరగతిలో ప్రవేశాలకు; అదేవిధంగా 7, 8, 9 తరగతుల్లో మిగిలిపోయిన బ్యాగ్‌లాగ్‌ సీట్ల భర్తీకి సంబంధించి ప్రవేశ ప్రకటన వెలువడింది. ఎంపికైన విద్యార్థులకు ఉచిత వసతి, విద్య అందిస్తారు. గిరిజన, ఆదివాసీ గిరిజన, సంచార గిరిజన తదితర కేటగిరీలకు చెందిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
Andhra Pradesh Government Tribal Welfare Gurukula Vidyalayas   Admission Announcement  Admission Open for Andhra Pradesh Gurukula Vidyalayas   Admissions in Eklavya Model Residential Schools   Andhra Pradesh Tribal Welfare Gurukula Vidyalayas Admission 2024-25

అర్హత: ఆరో తరగతిలో ప్రవేశాలు పొందాలనుకొనే విద్యార్థులు 2023–24 విద్యా సంవత్సరంలో ఐదో తరగతి చదివి ఉండాలి. 7, 8, 9 తరగతుల్లో ప్రవేశానికి వరుసగా 6, 7, 8 తరగతుల్లో ఉత్తీర్ణులై ఉండాలి. విద్యార్థి తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.లక్ష మించకూడదు.
వయసు: 31.03.2024 నాటికి ఆరో తరగతికి 10 నుంచి 13 ఏళ్లు, ఏడో తరగతికి 11 నుంచి 14 ఏళ్లు, ఎనిమిదో తరగతికి 12 నుంచి 15 ఏళ్లు, తొమ్మిదో తరగతికి 13 నుంచి 16 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా సీటు కేటాయిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 31.03.2024
ప్రవేశ పరీక్ష తేది: 13.04.2024.

వెబ్‌సైట్‌: https://twreiscet.apcfss.in/

చదవండి: TS EdCET 2024: టీఎస్‌ ఎడ్‌సెట్‌–2024 నోటిఫికేషన్‌.. పరీక్ష విధానం ఇలా..

Published date : 16 Mar 2024 11:51AM

Photo Stories