Professor Posts in JNTUA: జేఎన్‌టీయూ (ఏ)లో ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి ఆమోదం

అనంతపురం: జేఎన్‌టీయూ(అనంతపురం) లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్‌, అసోసియేట్‌, ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. ఇందుకు సంబంధించిన గెజిట్‌ను గురువారం జారీ చేసింది. వర్సిటీలో పోస్టుల భర్తీకి హేతుబద్ధీకరణ (రేషనలైజేషన్‌) కూడా పూర్తయ్యింది. ఎన్ని పోస్టులు భర్తీ చేస్తారనే అంశంపై స్పష్టత వచ్చింది. మొత్తం 203 పోస్టులను యుద్ధప్రాతిపదికన భర్తీ చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు వర్సిటీ త్వరలోనే ప్రత్యేక నోటిఫికేషన్‌ జారీ చేయనుంది. ఎస్కేయూ సైతం ఇదే తరహాలోనే నోటిఫికేషన్‌ ఇవ్వనుంది. రాత పరీక్షను ఏపీపీఎస్సీ నిర్వహిస్తుంది. ఇందులో మెరిట్‌ వచ్చిన వారికి ఆయా వర్సిటీల పరిధిలోనే ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు.

చ‌ద‌వండి: GATE 2024: గేట్‌–2024తో పీఎస్‌యూ కొలువులు.. ఎంపిక ప్రక్రియ, విజయానికి మార్గాలు..

#Tags