Good News.. January 26,27,28 Holidays : జ‌న‌వ‌రి 26,27,28 తేదీల్లో స్కూల్స్‌, కాలేజీల‌ సెల‌వులు.. కార‌ణం ఇదే..!

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఇటీవ‌లే తెలుగు రాష్ట్రాల్లో స్కూల్స్‌, కాలేజీల‌కు సంక్రాంతి సెల‌వులు భారీగా వ‌చ్చిన విష‌యం తెల్సిందే. ఇప్పుడు ఇదే నెల‌లో మ‌రో సారి వ‌రుస‌గా మూడు రోజులు పాటు స్కూల్స్‌కు సెల‌వులు రానున్నాయి. 2024 జనవరి 26వ తేదీన (శుక్ర‌వారం) గణతంత్ర దినోత్సవం.

క‌నుగా ఈ రోజున అన్ని స్కూల్స్‌, కాలేజీల‌కు, ఆఫీసుల‌కు సెలవు ఉంటుంది. అలాగే జ‌న‌వ‌రి 27వ తేదీ నాల్గోవ శ‌నివారం. ఈ రోజు కూడా సాధార‌ణంగా చాలా స్కూల్స్‌, కాలేజీల‌కు, ఆఫీస్‌ల‌కు సెల‌వులు ఉంటుంది. అలాగే జ‌న‌వ‌రి 28వ తేదీన ఆదివారం. ఈ రోజులు కూడా స్కూల్స్‌, కాలేజీల‌కు, ఆఫీస్‌ల‌కు సెల‌వులు ఉన్న విష‌యం తెల్సిందే. క‌నుగా జ‌న‌వ‌రి 26,27,28 తేదీల్లో వ‌రుస‌గా మూడు రోజుల పాటు సెల‌వులు రానున్నాయి.

 Telangana Holidays 2024 List : 2024 స్కూల్స్‌, కాలేజీల‌కు సెల‌వులు ఇవే.. ఏడాదిలో మొత్తం ఎన్ని రోజులు హాలిడేస్ అంటే..?

జనవరి 25వ తేదీన కూడా..
హజారత్ అలీ పుట్టినరోజు (జనవరి 25)ఇది ప్రవక్త ముహమ్మద్ బంధువు, అల్లుడు, ఇస్లాం నాల్గవ ఖలీఫా అలీ ఇబ్న్ అబీ తాలిబ్ జన్మదినాన్ని జరుపుకునే మతపరమైన సెలవుదినం. అతని జ్ఞానం, ధైర్యం, న్యాయం, దైవభక్తి కలగాలని సున్నీ, షియా ముస్లింలు ప్రార్థనలు చేస్తారు. సూఫీ ముస్లిం సోదరులు కూడా హజారత్ అలీని గౌరవిస్తారు. హజారత్ అలీని ప్రవక్త సరైన వారసుడిగా భావించే షియా ముస్లింలు మొదటి ఇమామ్‌గా కూడా పరిగణించారు. ముస్లింలు ప్రార్థనలు చేయడం, ఉపవాసం చేయడం, అతని బోధనలు, సూక్తులు పఠించడం ద్వారా ఈ రోజును పాటిస్తారు.

☛ 10th Class Maths Important Topics: ఈ టాపిక్స్ చదివితే 10/10 GPA గారంటీ!

జనవరి 26వ తేదీన‌..

గణతంత్ర దినోత్సవం (జనవరి 26, 2024)1935 భారత ప్రభుత్వ చట్టం స్థానంలో భారత రాజ్యాంగం 1950లో అమల్లోకి వచ్చిన తేదీని రిపబ్లిక్ డే గా సెలబ్రేట్ చేసుకుంటారు. రాజ్యాంగం భూమి అత్యున్నత చట్టం, ఇది పౌరుల హక్కులు, ప్రభుత్వ నిర్మాణం, విధులను నిర్వచిస్తుంది. ఈ రోజు ప్రధాన ఆకర్షణ ఢిల్లీలోని రాజ్‌పథ్‌లో జరిగే కవాతు నిలుస్తుంది. ఇక్కడ భారత రాష్ట్రపతి జాతీయ జెండాను ఎగురవేసి సాయుధ దళాలు, సాంస్కృతిక బృందాల గౌరవ వందనం స్వీకరించారు. కవాతు భారతదేశ సాంస్కృతిక, ప్రాంతీయ వైవిధ్యం, అలాగే వివిధ రంగాల విజయాలు, ఆవిష్కరణలను కూడా ప్రదర్శిస్తుంది. జెండా ఎగురవేత వేడుకలు, సాంస్కృతిక కార్యక్రమాలు, దేశభక్తి గీతాలతో దేశవ్యాప్తంగా కూడా ఈ రోజు జరుపుకుంటారు. ఈ రోజున స్కూల్స్‌, కాలేజీల‌కు సెల‌వులు ఇస్తారు. జన‌వ‌రి నెల‌లో స్కూల్స్‌, కాలేజీల‌కు భారీగా సెల‌వులు వ‌స్తున్నాయి. మీరు మీ స్కూల్స్‌లో హాలిడేస్ గురించి పూర్తి స‌మాచారం తెలుసుకోని అప్పుడు సెల‌వు తీసుకోండి.

☛ 10th Class Preparation Tips: టెన్త్‌ క్లాస్‌లో.. పదికి పది గ్రేడ్‌ పాయింట్లు సాధించేందుకు సబ్జెక్ట్‌ వారీగా ప్రిపరేషన్‌ టిప్స్‌..

2024లో సెల‌వులు వివ‌రాలు ఇవే..

☛ 26-01-2024 (శుక్రవారం) రిపబ్లిక్ డే
☛ 08-03-2024 (శుక్రవారం) మహాశివరాత్రి
☛ 25-03-2024 (సోమవారం) హోలీ
☛ 29-03-2024 (శుక్రవారం) గుడ్ ఫ్రైడే
☛ 05-04-2024 (శుక్రవారం) (బాబు జగ్జీవన్ రామ్‌ జయంతి)
☛ 09-04-2024 (మంగళవారం) ఉగాది
☛ 11-04-2024 (గురువారం) ఈద్ ఉల్ ఫితర్
☛ 17-04-2024 (బుధవారం) శ్రీరామనవమి
☛ 17-06-2024 (సోమవారం) బక్రీద్
☛ 17-07-2024 (బుధవారం) మొహర్రం
☛ 15-08-2024 (గురువారం) స్వాతంత్ర్య దినోత్సవం
☛ 26-08-2024 (సోమవారం) శ్రీ కృష్ణాష్టమి
☛07-09-2024 (శనివారం) వినాయకచవితి
☛ 16-09-2024 (సోమవారం) ఈద్ మిలాద్ ఉన్ నబి
☛ 02-10-2024 (బుధవారం) గాంధీ జయంతి
☛ 11-10-2024 (శుక్రవారం) దుర్గాష్టమి
☛ 31-10-2024 (గురువారం) దీపావళి
☛ 25-12-2024 (బుధవారం) క్రిస్మస్

#Tags