Skip to main content

Anganwadis Problems: అంగన్‌వాడీలకు కష్టాలు ఎందుకంటే..

Anganwadis Problems  Anganwadi center in Khammamvantown  Anganwadi teachers discussing rent issues  Unpaid rent notice for Anganwadi center  Government officials discussing Anganwadi center rent issues
Anganwadis Problems

ఖమ్మంవన్‌టౌన్‌: అంగన్‌వాడీ కేంద్రాలకు అద్దె కష్టాలు వచ్చిపడ్డాయి. కొత్త ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల అద్దె చెల్లింపుపై దృష్టి సారించకపోవడంతో జిల్లావ్యాప్తంగా రూ.1.57కోట్ల మేర బకాయిలు పేరుకుపోయాయి. దీంతో అద్దె చెల్లించాలని భవన యజమానులు టీచర్లపై ఒత్తిడి తీసుకొస్తుండడంతో వారికి ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఎదురవుతోంది.

Anganwadi Centers Closed: మూతపడిన అంగన్‌వాడీ కేంద్రాలు

450 సెంటర్లు అద్దె భవనాల్లో..

జిల్లాలో 1,840 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా.. అందులో 956 కేంద్రాలకు సొంతభవనాలు ఉన్నాయి. మిగతా వాటిలో 450 కేంద్రాలు అద్దెభవనాల్లో, 434 సెంటర్లు ప్రభుత్వ పాఠశాలల్లో నడుస్తున్నాయి. అద్దె భవనాలకు సంబంధించి 196 కేంద్రాలు అర్బన్‌ ప్రాంతాల్లో ఉండగా రూ.6వేలు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాటికి నెలనెలా రూ.2వేల అద్దె చెల్లించాల్సి ఉంటుంది.

అయితే, నెలనెలా నిధులు విడుదల కాకపోవడంతో టీచర్లు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ఈ ఏడాది మార్చి వరకు బకాయిలు చెల్లించగా.. ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు చెల్లించాల్సి ఉంది. ఈనేపథ్యాన యజమానులు టీచర్లపై ఒత్తిడి చేస్తుండడంతో కొందరు సొంత డబ్బులు చెల్లిస్తున్నారు. మిగతా వారు నిధుల కోసం ఎదురుచూడాల్సి వస్తోంది.

ఈ నెలాఖరు లోపు రావొచ్చు...

అద్దె భవనాల్లో కొనసాగుతున్న 450 సెంటర్లకు మూడు నెలల బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఈవిషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ఈ నెలాఖరు లోపు ప్రభుత్వం బిల్లులు విడుదల చేసే అవకాశం ఉంది. ఆ వెంటనే చెల్లింపులు చేపడతాం. – రాంగోపాల్‌రెడ్డి, జిల్లా సంక్షేమాధికారి

Published date : 13 Jul 2024 08:31PM

Photo Stories