10th Class Maths Important Topics: ఈ టాపిక్స్ చదివితే 10/10 GPA గారంటీ!
ఆరు పేపర్లుగానే
ఆంధ్రప్రదేశ్ లో ఈ ఏడాది నుంచి ఆరు పేపర్లుగా పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. పేపర్–1, పేపర్–2 విధానానికి స్వస్తి పలికారు. దీనికి బదులుగా ప్రతి పేపర్‌లోనూ పార్ట్–ఎ, పార్ట్–బిలు ఉంటాయి. ఇంతకుముందు జరిగిన పేపర్–1,పేపర్–2 విధానంలో విద్యార్థులు ఎదుర్కొనే ఒత్తిడిని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సబ్జెక్ట్ నిపుణుల విశ్లేషణ. రెండు పేపర్ల స్థానంలో ఒకే పేపర్‌గా ఏపీలో 100 మార్కులకు ప్రతి సబ్జెక్ట్‌లోనూ పరీక్షలు నిర్వహించనున్నారు.
మొత్తం సిలబస్ అంశాల నుంచి ఒకే పేపర్‌లో ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. పరీక్షకు కేటాయించే వ్యవధిని పెంచడం విద్యార్థులకు ఊరటనిచ్చే అంశం. పరీక్ష సమయాన్ని ఏపీలో 3:15 గంటలుగా పేర్కొన్నారు.
Download AP 10th Class Model Papers 2024
ఆంధ్రప్రదేశ్ పదో తరగతి మ్యాథమెటిక్స్ పరీక్ష స్వరూపం
ఒక మార్కు ప్రశ్నలు 12(12 మార్కులు), రెండు మార్కుల ప్రశ్నలు 8(16 మార్కులు), నాలుగు మార్కుల ప్రశ్నలు 8(32 మార్కులు), ఎనిమిది మార్కుల ప్రశ్నలు 5(40 మార్కులు).
మ్యాథమెటిక్స్ టాపిక్స్... టిప్స్
- పదో తరగతి స్థాయిలో విద్యార్థులు క్లిష్టంగా భావించే సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్.
- సిలబస్ అంశాలను పూర్తిగా అధ్యయనం చేస్తూ.. ప్రాక్టీస్ చేయడం ద్వారా ఈ సబ్జెక్ట్‌పై పట్టు సాధించొచ్చు.
- సంఖ్యా వ్యవస్థ; బీజగణితం; నిరూపక రేఖాగణితం; రేఖా గణితం; క్షేత్రమితి; త్రికోణమితి; సంభావ్యత, సాంఖ్యకశాస్త్రంపై సంపూర్ణ అవగాహన పెంచుకోవాలి.
- ప్రాబ్లమ్ సాల్వ్ చేయడంతోపాటు కారణాల నిరూపణ, వ్యక్తీకరణ, ఒక సమస్యను ఇతర అంశాలతో అనుసంధానం చేయడం వంటి నైపుణ్యాలు పొందాలి.
- ముఖ్యమైన నిర్వచనాలు, సూత్రాలను నోట్స్ రూపంలో రాసుకుంటే.. రివిజన్ సమయంలో ఉపయుక్తంగా ఉంటుంది.
- పాఠ్యపుస్తకంలో ప్రతి చాప్టర్ చివరన ఇచ్చే సమస్యలను తప్పకుండా ప్రాక్టీస్ చేయాలి.
- గ్రాఫ్‌లు, నిర్మాణాత్మక సమస్యలకు సమాధానాలు కనుగొనేందుకు ప్రాక్టీస్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి.
- వాస్తవ సంఖ్యలు; సమితులు; బహుపదులు; రెండు చరరాశులలోని రేఖీయ సమీకరణాల జత అధ్యాయాలలోని గ్రాఫ్ ఆధారిత సమస్యలు; సంభావ్యత; సాంఖ్యక శాస్త్రం; త్రికోణమితి; క్షేత్రమితిలోని ముఖ్యమైన సమస్యలను సాధన చేయాలి.
–కె.సారథి, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ నిపుణులు
పదో తరగతిలో విద్యార్థులు మంచి మార్కులు, జీపీఏ సాధించాలంటే.. పాఠ్యపుస్తకాల అభ్యసనంతోపాటు అనువర్తిత దృక్పథం సొంతం చేసుకోవాలి. చదివే ప్రతి అంశాన్ని సంపూర్ణంగా అవగాహన చేసుకుంటూ.. ఆయా సబ్జెక్ట్ అంశాలపై పట్టు సాధించాలి’ అంటున్నారు సబ్జెక్ట్ నిపుణులు. చక్కటి ప్రణాళికతో చదువు కొనసాగిస్తే.. మంచి మార్కులు సాధించడం కష్టమేమీ కాదు.