AI Work Shop: ఆర్టిఫీషియల్‌ ఇంటలిజన్స్‌నై వర్క్‌ షాప్‌ ప్రారంభం

ట్రిపుల్‌ఐటీడీఎం లో నిర్వహించిన ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌పై వర్క్‌షాప్‌ను సోమవారం పలువురు అధికారులు, ముఖ్య అతిథులు ప్రారంభించారు. ఈ వేదికలో వారంతా మాట్లాడుతూ..

కర్నూలు సిటీ: ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ డిజైన్‌ అండ్‌ మ్యాన్‌ఫ్యాక్చరింగ్‌ (ట్రిపుల్‌ఐటీడీఎం)లోని మెకానికల్‌ విభాగం ఆధ్వర్యంలో సోమవారం రోబోల కోసం ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌పై వర్క్‌షాపు ప్రారంభమైంది. ఈ వర్క్‌షాపును డీఆర్‌డీఓ శాస్త్రవేత్త (పూణే) డాక్టర్‌ కిరణ్‌ ఆకెళ్ల, ట్రిపుల్‌ఐడీడీఎం డైరెక్టర్‌ డీవీఎల్‌ఎన్‌ సోమయాజూలు ప్రారంభించారు.

Agniveer Posts: ఇండియన్‌ ఆర్మీలో అగ్నివీర్‌ పోస్టులకు దరఖాస్తులు

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోబోల తయారీలో ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ చక్కగా ఉపయోగపడుతుందన్నారు. ఏఐ విభాగంలో పరిశోధనలు చేసే విద్యార్థులకు వారం రోజుల పాటు జరిగే వర్క్‌ షాపు ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో వర్క్‌షాపు కో–ఆర్డినేటర్‌ డాక్టర్‌ రవికుమార్‌ మండవ తదితరులు పాల్గొన్నారు.

#Tags