Skip to main content

Agniveer Posts: ఇండియన్‌ ఆర్మీలో అగ్నివీర్‌ పోస్టులకు దరఖాస్తులు

అర్హత ఆసక్తి ఉన్నవారు ఆర్మీలో అగ్నివీర్‌ పోస్టులకు దరఖాస్తులు చేసుకోవాలని ప్రకటించారు జిల్లా సైనిక సంక్షేమాధికారి. దరఖాస్తుల తేదీ, వివరాలను కూడా ఆయన వెల్లడించారు..
Apply for Agniveer Posts in Indian Army   Opportunity for Candidates in Kakinada and Surrounding Districts  Applications for Agniveer Posts in Indian Army   Indian Army Recruitment Announcement

కాకినాడ సిటీ: ఇండియన్‌ ఆర్మీలో అగ్నివీర్‌ పోస్టుల భర్తీకి కాకినాడ, తూర్పు గోదావరి, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాల్లో అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. జిల్లా సైనిక సంక్షేమాధికారి ఎం.కృష్ణారావు సోమవారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు.

 Permanent Employees: వైద్యారోగ్యశాఖలో పర్మెనెంట్‌ అయిన కాంట్రాక్ట్‌ ఉద్యోగులు

టెక్నికల్‌, జనరల్‌ డ్యూటీ, నాన్‌ టెక్నికల్‌, స్టోర్‌ కీపర్‌, ట్రేడ్స్‌మన్‌ పోస్టులకు ఎనిమిదో తరగతి, ఇంటర్మీడియెట్‌, ఐటీఐ చదివిన 17 నుంచి 21 ఏళ్ల లోపు వయస్సు ఉన్న వారు వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రతిభ ఆధారంగా నియామకాలు జరుగుతాయని, దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని తెలిపారు. దరఖాస్తులకు ఈ నెల 22 చివరి తేదీ అని పేర్కొన్నారు.

Published date : 12 Mar 2024 02:41PM

Photo Stories