Today and Tomorrow Schools and Colleges Bandh : నేడు.., రేపు స్కూల్స్‌, కాలేజీల‌కు సెల‌వులు.. కార‌ణం ఇదే !

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఇటీవ‌ల కాలంలో స్కూల్స్‌, కాలేజీల‌కు అనుకోకుండా సెల‌వులు భారీగానే వ‌స్తున్నాయి. వివిధ ర‌కాల బంద్‌లు, వ‌ర్షాలు, మొద‌లైన ప్రకృతి వైపరీత్యాలు విద్యాసంస్థలను సెలవులు ఇస్తున్నారు. ఇప్పుడు తాజాగా పొగమంచు కారణంగా పలు చోట్ల విద్యాసంస్థలను సెలవు కూడా ప్రకటించారు. భారీగా కురుస్తున్న పొగమంచు కారణంగా విమానాలు, రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.

అలాగే వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఐఎండీ అంచనాల ప్రకారం.. మరో రెండు రోజులు కూడా ఈ చలి ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం ఉంది. ఉత్తరాదితోపాటు తూర్పు భారతదేశంలో కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అధికారులు తెలిపారు. రానున్న రెండు, మూడు రోజుల్లో 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు. ఇక మధ్య భారతంలో చలి తీవ్రత రాబోయే మూడు రోజులు ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.

నేడు.. రేపు..
ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, చండీగఢ్, రాజస్థాన్, బీహార్, మధ్యప్రదేశ్, త్రిపుర, జమ్మూ ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు అలుముకుంది. జ‌న‌వ‌రి 4వ తేదీన (గురువారం) తెల్లవారుజాము నుంచే దట్టమైన పొగమంచు కమ్ముకుంది. ఉదయం ఏడు గంటలు దాటినా రోడ్డు కనిపించకపోవడంతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. మరోవైపు, పొగమంచు ప్రభావం అటు విమానాలు, రైళ్ల రాకపోకలపై కూడా పడుతుండటంతో పలు సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. పొగమంచు కారణంగా ఢిల్లీలో పలు విమానాలు ఆలస్యంగా ప్రయాణించనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇదిలా ఉండగా, దక్షిణ భారతంలో పలుచోట్ల మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో శీతల గాలుల కారణంగా చలి తీవ్రత పెరిగింది.

 Telangana Holidays 2024 List : 2024 స్కూల్స్‌, కాలేజీల‌కు సెల‌వులు ఇవే.. ఏడాదిలో మొత్తం ఎన్ని రోజులు హాలిడేస్ అంటే..?

తెలుగు రాష్ట్రాల్లో కూడా..
తెలుగు రాష్ట్రాల్లో కూడా చలి తీవ్రత, పొగమంచు కూడా ఎక్కువ‌గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి హడావిడి ప్రారంభ‌మైంది. ఇప్ప‌టికే స్కూల్స్‌, కాలేజీల‌కు ముందుగానే సెల‌వులు ప్ర‌క‌టించారు. తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా స్కూల్స్‌, కాలేజీల‌కు జ‌న‌వ‌రి 3వ తేదీన‌(బుధ‌వారం) సంక్రాంతి పండుగ సెల‌వుల‌ను ప్ర‌క‌టించింది.

తెలంగాణ‌లోని స్కూల్స్‌కు జనవరి 12వ తేదీ నుంచి 17వ తేదీ వరకు సెలవులు ఉంటాయని ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది. మిషనరీ స్కూళ్లకు మినహా అన్ని స్కూళ్లకు ఈ సెలవులు వర్తిస్తాయని పేర్కొంది. ఇక, జనవరి 13న రెండో శనివారం కాగా.. 14న భోగి, 15న సంక్రాంతి, 16న కనుమ పండుగలు ఉన్నాయి. అలాగే జనవరి 25, 26న కూడా సెలవు రానుంది.

కాలేజీల‌కు సంక్రాంతి సెలవులు ఇవే.. 
తెలంగాణలోని ఇంటర్మీడియట్ కాలేజీల‌కు జనవరి 13వ తేదీ నుంచి 16వ తేదీ వరకు సెలవులను ఇంట‌ర్ బోర్డ్‌ ప్రకటించింది. మొత్తం 4 రోజుల పాటు కాలేజీల‌కు సెల‌వులు రానున్నాయి. జనవరి 17వ తేదీన‌ తిరిగి ఇంటర్మీడియట్ కళాశాలు తెరుచుకోనున్నాయి. అలాగే డిగ్రీ, ఇంజ‌నీరింగ్ కాలేజీల‌కు కూడా దాదాపు నాలుగు రోజులు పాటు సంక్రాంతి సెలవులు రానున్నాయి.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కూడా..
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అత్య‌తం వైభవంగా జ‌రుపుకునే పండ‌గ‌ల్లో సంక్రాంతి పండ‌గ ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉంటుంది. తెలంగాణ‌లో కంటే.. ఏపీలోనే సంక్రాంతి పండ‌గ ఘ‌నంగా జ‌రుపుకుంటారు. 2024లో సంక్రాంతి పండ‌గ‌కు ఏపీ ప్ర‌భుత్వం స్కూల్స్‌, కాలేజీల‌కు భారీగానే సెల‌వులు ఇచ్చారు. ఈ సారి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సంక్రాంతి సెల‌వులు నాలుగు నుంచి ఆరు రోజులు పాటు రానున్నాయి. 

జ‌న‌వ‌రి 13వ తేదీన రెండో శ‌నివారం చాలా స్కూల్స్‌, కాలేజీల‌కు సెల‌వు ఉంటుంది. అలాగే జ‌న‌వ‌రి 14వ తేదీన భోగి పండ‌గ.. ఆదివారం వ‌చ్చింది. జ‌న‌వ‌రి 15వ తేదీన సంక్రాంతి పండ‌గ‌.. సాధార‌ణంగా సెల‌వులు ఉంటుంది. అలాగే జ‌న‌వ‌రి 16వ తేదీన ఆప్ష‌న‌ల్ హాలిడే ఇచ్చారు. దీంతో పాటు స్కూల్స్‌, కాలేజీల‌కు మ‌రో రెండు రోజులు పాటు అద‌నం సెల‌వులు ఇచ్చే అవ‌కాశం ఉంది. దీంతో స్కూల్స్, కాలేజీల‌కు దాదాపు 6 రోజులు పాటు స్కూల్స్, కాలేజీల‌కు సెలవులు వ‌చ్చే అవ‌కాశం ఉంది.

☛ AP Holidays 2024 List : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సాధారణ సెలవులు ఇవే.. స్కూల్స్‌, కాలేజీల‌కు మాత్రం..

#Tags