Sankranti Holidays 2025 : సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.. ఎన్నిరోజులంటే..!
సాక్షి ఎడ్యుకేషన్: సాధారణంగా విద్యార్థులు ఆదివారం సెలవు అంటేనే ఎగిరి గంతులేస్తారు. అటువంటిది ఇప్పుడు కొత్త సంవత్సరం ప్రారంభమైంది. అంటే, సంక్రాంతి సెలవులు రాబోతున్నాయి అన్నమాట. అయితే, ఈ సెలవులు ఒకటి, రెండు రోజులు కాదు, వారం లేదా పది రోజులు ఉంటాయి. ఏపీలో ఇది పెద్ద పండుగ కాబట్టి ఎక్కువ రోజులు ఇచ్చే అవకాశం ఉంటుంది. తెలంగాణలో మాత్రం వారం రోజులు సెలవులు ఉంటాయని చెబుతున్నారు. ఇప్పటికే ఏపీలో ఈ సెలవులపై ఎన్నో అవాస్తవ వార్త తరువాత ఒక క్లారిటీ వచ్చేసింది. మరి, తెలంగాణలో ఈసారి సంక్రాంతికి ఎన్నిరోజులు సెలవులు ఉంటాయో తెలుసుకుందాం..
Good News for Students : విద్యార్థులకు శుభవార్త.. ఈనెలలో ఏకంగా 9 సెలవులు.. కానీ!!
మూడు రోజులు..
సంక్రాంతికి తెలంగాణలో ఈసారి ఎన్నిరోజులు సెలవులు ఇస్తారనే విషయంపై గందరగోళం నెలకొంది. దీనిపై ప్రభుత్వం నుంచి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. నూతన సంవత్సరంలో విడుదల చేసిన సెలవుల జాబితా ప్రకారం జనవరిలో వచ్చే పండుగ సంక్రాంతికి మూడు రోజులు సెలవులు ఉంటాయి. జనవరి 13వ తేదీ భోగి, జనవరి 14వ తేదీన సంక్రాంతి, జనవరి 15వ తేదీన కనుమ ఉంటుంది. కాని, 15వ తేదీకి మాత్రం ఉన్న సెలవు ఆప్షనల్‌గా ప్రకటించింది ప్రభుత్వం.
మొత్తం ఆరు రోజులు..
అయితే, విద్యార్థులకు పండుగ సందర్భంగానే కాకుండా, భోగికి ముందు అంటే జనవరి 11వ తేదీన రెండో శనివారం ఉంది. ఆ తర్వాత ఆదివారం కూడా సెలవు ఉంది. అంటే జనవరి 11వ తేదీ నుంచే సంక్రాంతి సెలవులు ప్రారంభం అవుతాయి. ఈ సెలవులు జనవరి 16వ తేదీ వరకు ఉంటాయని తెలిసింది. జనవరి 17వ తేదీ నుంచి తిరిగి పాఠశాలలు పునఃప్రారంభం అవుతాయి. ఒకవేళ ప్రభుత్వం జనవరి 15వ తేదీ వరకే నిర్ణయిస్తే… జనవరి 16వ తేదీనే స్కూళ్లన్నీ తిరిగి తెరుచుకునే అవకాశం ఉంటుంది.
Good News for Students : విద్యార్థులకు శుభవార్త.. 15 రోజులు సెలవులు.. ఈ తేదీల్లోనే..
మరోవైపు ఏపీలో సంక్రాంతి సెలవులపై క్లారిటీ వచ్చేసింది. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు జనవరి 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ఉంటాయి. మొదట్లో సెలవులు తగ్గిస్తారనే చర్చ వచ్చినప్పటికీ… సెలవులు తగ్గించే యోచన లేదని అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)