Jobs for JNTU GV Students: జేఎన్‌టీయూ జీవీ విద్యార్థులకు ఉద్యోగాలు

విజయనగరం అర్బన్‌: జేఎన్‌టీయూ గురజాడ విజయనగరం (జీవీ)లోని ఇంజినీరింగ్‌ కళాశాలకు చెందిన మెకానికల్‌ విద్యార్థులు 9 మందికి క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌లో ఉద్యోగాలు లభించాయి.

ఈ మేరకు కళాశాల ప్రిన్సిపల్‌ ప్రొఫెసర్‌ కె.శ్రీకుమార్‌ గురువారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఇటీవల కాంపస్‌లో ‘సైంట్‌ లిమిటెడ్‌’ నిర్వహించిన ప్లేస్‌మెంట్‌ ప్రక్రియలో తొమ్మిది మంది విద్యార్థులు ఎంపికయ్యారని తెలిపారు. వార్షిక కనీసం వేతనం రూ.4.5 లక్షలతో ఎంపికై న వారికి ఉద్యోగావకాశాలు దక్కాయని పేర్కొన్నారు. ఎంపికై న విద్యార్థులకు వీసీ ప్రొఫెసర్‌ కె.వెంకటసుబ్బయ్య, రిజస్ట్రార్‌ ప్రొఫెసర్‌ జి.జయసుమ, కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ కె.శ్రీకుమార్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఆర్‌.గురునాథ, మెకానికల్‌ ఇంజినీరింగ్‌ విభాగాధిపతి డాక్టర్‌ సి.నీలిమాదేవి, ట్రైనింగ్‌ అండ్‌ ప్లేస్‌మెంట్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ టీఎస్‌ఎన్‌ మూర్తి అభినందనలు తెలిపారు.

చదవండి: RRB Notification 2024: 9000 టెక్నీషియన్‌ పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

#Tags