Actor Suriya Daughter Scores Top In Inter Exams: ఇంటర్‌లో టాప్ మార్కులతో అదరగొట్టిన సూర్య కూతురు
సౌత్ ఇండియాలో బ్యూటిఫుల్ కపుల్స్‌గా సూర్య- జ్యోతిక జంట ఉంటుంది. చిత్రసీమలో అత్యంత ప్రజాదరణ పొందిన జోడీగా వీరికి గుర్తింపు ఉంది. వీరి కుమార్తె దియా ఇటీవల ముగిసిన 12వ తరగతి సాధారణ పరీక్షలో మంచి మార్కులు సాధించినట్లు సమాచారం. ఇరు కుటుంబాల అంగీకారంతో 2006లో ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే, ఈ దంపతలులకు దియా అనే 17 ఏళ్ల కుమార్తెతో పాటు దేవ్ అనే 15 ఏళ్ల కుమారుడు ఉన్నారు.
సూర్య కుటుంబం మొత్తం సినిమా రంగంలో ఉన్నప్పటికీ దియా, దేవ్ ఇద్దరు కూడా సినిమాల్లోకి అడుగుపెట్టలేదు. దియా టెన్నిస్, ఫుట్‌బాల్ ఆటలపై దృష్టి సారిస్తుంటూ.. దేవ్ కరాటే వైపు అడుగులు వేస్తున్నాడు. చదువుతో పాటుగా ఆటలపై కూడా వారు ఆసక్తి చూపుతున్నారు.
ఇంటర్‌లో అదరగొట్టిన దియా
సూర్య కూతురు దియా ఈ ఏడాది పన్నెండో తరగతి పరీక్షలు రాసింది. తాజాగా ఫలితాలు కూడా విడుదలయ్యాయి. దియా మంచి మార్కులతో పాస్ అయినట్లు సోషల్‌మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆమె సాధించిన మార్కులు ఇవే అంటూ కోలీవుడ్‌లో వైరల్ అవుతుంది. తమిళంలో 100కి 96, ఇంగ్లిష్‌లో 97, గణితంలో 94, ఫిజిక్స్‌లో 99, కెమిస్ట్రీలో 98, కంప్యూటర్ సైన్స్‌లో 97 మార్కులు సాధించినట్లు తెలుస్తోంది.
600 మార్కులకు గాను 581 మార్కులు సాధించినట్లు సమాచారం. దియా ఇన్ని మార్కులు సాధించినందుకు కుటుంబ సభ్యులు ఆనందంగా సంబరాలు చేసుకుంటున్నారట. ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్న ఈ సమాచారం ఎంత వరకు నిజమో తెలియదు.
2022లో టెన్త్‌లో కూడా సత్తా చాటిన దియా
10వ తరగతి పరీక్షా ఫలితాల్లో కూడా దియా టాప్ మార్క్‌లు సాధించింది. తమిళంలో 95, ఆంగ్లంలో 99, గణితంలో 100, సైన్స్‌లో 98, సోషల్‌లో 95 మార్కులు సాధించింది. 500 మార్కులకు గాను 487 మార్కులు సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది.