Sports Competitions: హ్యాండ్‌బాల్ ఎంపిక‌ల‌కు పోటీలు

రాష్ట్రస్థాయిలో హ్యాండ్‌బాల్ పోటీల‌ను నిర్వ‌హిస్తున్నార‌ని ప్ర‌క‌టించారు. ఈ పోటీల‌కు ఎంపిక చేసేందుకు జిల్లాస్థాయిలో పోటీ ప‌డాల్సి ఉంటుంద‌ని క్రీడాకారుల‌ను డిగ్రీ క‌ళాశాల‌లో ఎంపిక కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు.
Community Representatives with selected players for handball competitions

సాక్షి ఎడ్యుకేష‌న్: జిల్లా స్థాయి హ్యాండ్‌బాల్‌ ఎంపిక పోటీలు ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగాయి. జిల్లా హ్యాండ్‌బాల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా జూనియర్స్‌ బాలురు, సీనియర్స్‌ మహిళల హ్యాండ్‌బాల్‌ జట్ల ఎంపిక పోటీలు శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల మైదానం వేదికగా జరిగాయి. జిల్లా హ్యాండ్‌బాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు సుంకరి కృష్ణకుమార్‌, ప్రధాన కార్యదర్శి ఎమ్మెస్సీ శేఖర్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఎంపికలకు జిల్లా నలుమూలల నుంచి క్రీడాకారులు హాజరై తమ ప్రతిభను నిరూపించుకున్నారు. ఎంపికైన క్రీడాకారుల జాబితాను త్వరలో వెల్లడిస్తామని కృష్ణకుమార్‌, చంద్రశేఖర్‌ పేర్కొన్నారు.

Students Sports: విద్యార్థుల‌కు క్రీడ‌లు అవ‌స‌రం

ఇక్కడ ఎంపికైన జిల్లా జట్లను ఈనెల 13 నుంచి 15వ తేదీ వరకు వైఎస్సార్‌ కడప జిల్లా వేదికగా జరగనున్న ఏపీ రాష్ట్రస్థాయి జూనియర్స్‌ బాలురు, సీనియర్స్‌ మహిళల హ్యాండ్‌బాల్‌ చాంపియన్‌షిప్‌–2023 పోటీలకు పంపిస్తామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ ప్రతినిధులు శేఖర్‌, గురుగుబెల్లి రాజశేఖర్‌, హరీష్‌రాయుడు, ఈశ్వరరావు, ఢిల్లేశ్వరరావు, కనకసుందర్‌, కోచ్‌లు సీనియర్‌ క్రీడాకారులు పాల్గొన్నారు.

#Tags