Skip to main content

Teacher's Achievement: ప్రైవేట్‌ కళాశాల అధ్యాపకునికి అమెరికా జీహెచ్‌పీయూ గుర్తింపు..!

జీహెచ్‌పీయూ గౌరవ డాక్టరేట్‌, భారత్‌ కళారత్న అవార్డుకు ఒక ప్రైవేట్‌ కళాశాల అధ్యాపకుడు ఎంపికయ్యారు.
Achievement of private college teacher with awards

కొత్తపేట: స్థానిక ఒక ప్రైవేట్‌ కళాశాల అధ్యాపకుడు, కవి, రచయిత వులుసు వీరవెంకట సత్య సుబ్బారావు అమెరికాకు చెందిన గ్లోబల్‌ హ్యూమన్‌ పీస్‌ యూనివర్సిటీ (జీహెచ్‌పీయూ) గౌరవ డాక్టరేట్‌, భారత్‌ కళారత్న అవార్డుకు ఎంపికయ్యారు. ఆ మేరకు జీహెచ్‌పీయూ ఫౌండర్‌ అండ్‌ చైర్మన్‌ డాక్టర్‌ పీ మాన్యూల్‌ ధ్రువీకరణ పత్రాలు పంపినట్టు సుబ్బారావు మంగళవారం కొత్తపేటలో విలేకరులకు తెలిపారు.

Girls School Admissions: నూత‌న విద్యా సంవ‌త్స‌రానికి బాలికోన్న‌త పాఠ‌శాల‌ల్లో ప్ర‌వేశ ద‌ర‌ఖాస్తులు..

రావులపాలెం మండలం గోపాలపురం గ్రామానికి చెందిన వులుసు సుబ్బారావు సత్యహరిశ్చంద్ర, బాలనాగమ్మ తదితర పౌరాణిక నాటకాలు, అన్నా – చెల్లెలు, పూలకంగడు, కనకపు సింహాసనమున హుష్‌కాకి, అన్నదాత తదితర సాంఘిక నాటకాల్లో ప్రధాన పాత్రలు పోషించిన కళాకారుడు. 2008లో కొత్తపేట వచ్చి స్థిరపడి ఒక ప్రైవేట్‌ కళాశాలలో లెక్చరర్‌గా తన వృత్తిని కొనసాగిస్తూ, ప్రవృత్తిగా కవి, రచయితగా తన ప్రతిభను చాటుకుంటున్నారు.

Certificate Courses: దూరవిద్య సర్టిఫికెట్‌ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

సుబ్బారావు బహుముఖ ప్రజ్ఞను గుర్తించిన జీహెచ్‌పీయూ గౌరవ డాక్టరేట్‌తో పాటు భారత్‌ కళారత్న అవార్డుకు ఎంపిక చేసింది. ఈ నెల 25 న చైన్నె భారతీయ విద్యాభవన్‌ ఆడిటోరియంలో జరిగే కార్యక్రమంలో ప్రముఖుల చేతుల మీదుగా సుబ్బారావుకు డాక్టరేట్‌ను, అవార్డును ప్రదానం చేయనున్నారు.

Inter Admissions: ప్రభుత్వ కళాశాలలే మిన్న.. అడ్మిషన్‌ ప్రక్రియ ఇలా..

Published date : 23 May 2024 12:11PM

Photo Stories