Skip to main content

Girls School Admissions: నూత‌న విద్యా సంవ‌త్స‌రానికి బాలికోన్న‌త పాఠ‌శాల‌ల్లో ప్ర‌వేశ ద‌ర‌ఖాస్తులు..

2024–25 విద్యా సంవత్సరంలో ఆశ్రమ బాలికోన్నత పాఠశాలలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవాలని పాఠశాల హెచ్‌ఎం పి పద్మ కోరారు..
Applications for girls high school admissions in new academic year

వెల్దుర్తి: పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం శిరిగిరిపాడు గ్రామంలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికోన్నత పాఠశాలలో 2024–25 విద్యా సంవత్సరంలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవాలని పాఠశాల హెచ్‌ఎం పి పద్మ కోరారు. సోమవారం ఆమె ఐటీడీఏ పాఠశాలలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 2024–25 విద్యా సంవత్సరంలో గిరిజన ఆశ్రమ పాఠశాలలో చేరేందుకు 21–5–2024 నుంచి 30–5–2024 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని పేర్కొన్నారు.

Gurukul Students Talent: బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్క్‌టెక్చర్‌ ఫలితాల్లో గురుకుల విద్యార్థుల ప్ర‌తిభ‌..

ఈ పాఠశాలలో అన్నీ తరగతులకు ఎస్టీ బాలికలు దరఖాస్తు చేసుకోవచ్చని ఆమె తెలిపారు. బీసీలు 3వ తరగతిలో ఆరు, 4వ తరగతిలో ఆరు, ఎస్సీలు 3వ తరగతిలో ఆరు, 4వ తరగతిలో ఆరు, 5వ తరగతిలో ఐదు, ఓిసీలు 3వ తరగతిలో ఆరు , 4వ తరగతిలో ఆరు, 5వ తరగతిలో మూడు, 7వ తరగతిలో నాలుగు సీట్లు ఖాళీలు ఉన్నాయని పద్మ వివరించారు . అర్హులైన వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు.

Semester Results: సెమిస్ట‌ర్ ఫ‌లితాలు విడుద‌ల‌..

Published date : 23 May 2024 12:13PM

Photo Stories