Skip to main content

Students Sports: విద్యార్థుల‌కు క్రీడ‌లు అవ‌స‌రం

పాఠ‌శాల మైదానంలో జరిపిన క్రీడా పోటీల్లో హ‌రిజ‌న సంక్షేమ శాఖ మంత్రి మాట్లాడి విద్యార్థుల‌కు క్రీడ‌ల్లో రాణించాల‌ని తెలిపారు. అలాగే, క్రీడ‌ల ప్రాధాన్య‌త గురించి కూడా తెలియ‌జేశారు.
Harijan Welfare Minister addressing students at sports competition, Importance of sports discussed at school ground event, Students inspired to participate in sports., Minister Saraka and MLA Gomango inaugurating the sports competition,
Minister Saraka and MLA Gomango inaugurating the sports competition

సాక్షి ఎడ్యుకేష‌న్: విద్యార్థులు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్‌ ఉంటుందని రాష్ట్ర ఆదివాసీ, హరిజన సంక్షేమ శాఖ మంత్రి జగన్నాథ సరక అన్నారు. స్థానిక గోవింద చంద్రదేవ్‌ ఉన్నత పాఠశాల మైదానంలో జిల్లా క్రీడా విభాగం ఆధ్వర్యంలో జిల్లాస్థాయి క్రీడా పోటీలను ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలియజేశారు. క్రీడలపై ఆసక్తి కనబరిచే విద్యార్థులకు ఎన్నో అవకాశాలు కల్పిస్తోందన్నారు.

School Teachers: ఉపాధ్యాయుల బ‌దిలీలు

విద్యార్థులు చదువుతో పాటు క్రీడలపై సైతం దృష్టి సారించాలని సూచించారు. గుణుపూర్‌ ఎమ్మెల్యే రఘునాథ్‌ గొమాంగొ, జిల్లా పరిషత్‌ అధ్యక్షురాలు సరస్వతి గొమాంగోలు మాట్లాడుతూ.. జిల్లాలో క్రీడాకారులకు ఎంతో ప్రోత్సాహం అందిస్తున్నామని తెలియజేశారు. రెండు రోజుల పాటు జరగనున్న క్రీడల్లో రాణించే విద్యార్థులకు రాష్ట్రస్థాయిలో పాల్గొనే అవకాశం లభిస్తుందని జిల్లా క్రీడా శాఖ అధికారి షేక్‌ ఆలీనూర్‌ తెలియజేశారు.

Published date : 09 Oct 2023 12:03PM

Photo Stories