School Teachers: ఉపాధ్యాయుల బదిలీలు
Sakshi Education
విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న పాఠశాలల్లో ఉపాధ్యాయుల బదిలీలు జరపాలని టీయూటీఎఫ్ అధ్యక్షులు తెలిపారు.
సాక్షి ఎడ్యుకేషన్: బదిలీలు పొందిన స్కూల్ అసిస్టెంట్లను విద్యార్థుల సంఖ్య అధికంగా ఉన్న పాఠశాలల్లో చేరేందుకు అవకాశం కల్పించాలని టీయూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీకాంత్, జలందర్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు డీఈవో ప్రణీతను ఆదివారం కలిసి వినతిపత్రం అందజేశారు. తక్కువ విద్యార్థులు కలిగిన ప్రాథమికోన్నత పాఠశాలల్లో పనిచేస్తూ బదిలీ పొందిన ఉపాధ్యాయులను విద్యార్థుల సంఖ్య అధికంగా ఉన్న పాఠశాలలకు రిలీవ్ చేయాలన్నారు.
NEET 2024 Syllabus: నీట్ విద్యలో జరిపిన మార్పులు
దీంతో విద్యార్థులకు మేలు చేకూరుతుందని చెప్పారు. అయితే కొందరు ఎంఈవోలు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. నిబంధనల ప్రకారం విడుదలకు అవకాశం ఉన్నా రిలీవ్ చేయడం లేదన్నారు. అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
Published date : 09 Oct 2023 12:20PM