Skip to main content

NEET 2024 Syllabus: నీట్ విద్య‌లో జ‌రిపిన మార్పులు

అండ‌ర్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల‌కు నీట్ విద్య‌లో సిల‌బ‌స్ ను త‌గ్గించిన‌ట్లు వెల్ల‌డించారు. ఈ నేప‌థ్యంలోనే నీట్ 2024 ఎంట్రెన్స్ టెస్ట్ కు సంబంధించి మార్పులు నిర్వ‌హించిన సిల‌బ‌స్ ను విడుద‌ల చేశారు.
NEET Syllabus for UG students
NEET Syllabus for UG students

ఎంబీబీఎస్, బీడీఎస్ వంటి మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (NEET UG 2024 NEW SYLLABUS ) అండర్ గ్రాడ్యుయేట్ సిలబస్ లో కోతపెట్టారు. విద్యార్థులపై భారం తగ్గించడంలో భాగంగా నీట్-2024 నూతన సిలబస్ ను నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) సిలబస్ లో స్పల్ప మార్పులు చేసింది.

 

NEET 2024 మే 5న నిర్వహిస్తారు. నీట్ రిజిస్ట్రేషన్లు ఇంకా ప్రారంభం కాలేదు. ఎన్ఎంసీ విడుదల చేసిన సిలబస్ ప్రకారం.. భౌతికశాస్త్రంలో అధికంగా సిలబస్ కోతకుగురైంది. కెమిస్ట్రీలోనూ కొన్ని పాఠ్యాంశాలను తగ్గించారు. బోటనీ, జువాలజీ సబ్జెక్టుల సిలబస్ తగ్గించారు

NEET DELETED SYLLABUS

రసాయనశాస్త్రం ఫస్టియర్: పదార్థం స్థితి, హైడ్రోజన్, S–బ్లాక్ ఎలిమెంట్స్, ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ.

రసాయనశాస్త్రం సెకండియర్: ఘనస్థితి, ఉపరితల రసాయాన శాస్త్రం, మెటలర్జీ, రోజువారీ జీవితంలో రసాయన శాస్త్రం, పాలిమర్లు.

భౌతికశాస్త్రం ఫస్టియర్: ప్యూర్ రోలింగ్, కనెక్టింగ్ బాడీలు, పాలిట్రోపిక్ ప్రక్రియ, బలవంతమైన, దెబ్బ తిన్న డోలనాలు.

భౌతికశాస్త్రం సెకండియర్: పొటెన్షియల్,ళనాన్ పొటెన్షియల్ సంభావ్యత, ప్రొటెన్షియో మీటర్, ఎర్త్ మ్యాగ్నటిజం, రేడియో యాక్టివిటీ, ట్రాన్సిస్టర్లు, ఆంప్లిఫ్లయర్లు.

జువాలజీలో యూనిట్-2: వానపాములు, యూనిట్-5లో శరీర నిర్మాణశాస్త్రం, జీర్ణక్రియ శోషణం, జ్ఞానేంద్రియాలు (చెవులు, కండ్లు), యూనిట్-10లో జీవావరణం ,పర్యావరణం, పర్యావరణ సమస్యలు, పశుసంవర్ధకం.

బోటనీ ఫస్టియర్: ప్లాంట్ ఫిజియోలజీలో ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాంట్స్, మినరల్ న్యూట్రిషన్, మార్పొలజీ.

బోటనీ సెకండియర్: స్ట్రాటజీస్ ఫర్ ఎన్ హ్యాన్స్ మెంట్ ఇన్ ఫుడ్ ప్రొడక్షన్.

బోటనీలో కొత్తగా చేర్చినవి: బయో మాలిక్యూల్స్, ఎంజైములు, ప్రాపర్టీలు, మాల్వేస్, లెగుమనీస్ సహా మరికొన్ని అంశాలను చేర్చారు.

Published date : 08 Oct 2023 01:09PM
PDF

Photo Stories