NASA Awards: నాసా అవార్డులు గెలుచుకున్న భారత విద్యార్థులు వీరే..
న్యూఢిల్లీ ముంబైకి చెందిన భారతీయ విద్యార్థుల బృందాలు నాసా అవార్డులను గెలుచుకున్నాయి. అలబామా రాష్ర్టంలోని హంట్స్ విల్లేలో ఉన్న అమెరికా అంతరిక్ష రాకెట్ కేంద్రంలో ఏప్రిల్ 19, 20 తేదీల్లో ఈ పోటీలు జరిగాయి.
ఢిల్లీకి చెందిన కేఐఈటీ గ్రూప్ విద్యాసంస్థకు చెందిన స్టూడెంట్స్ క్రాష్ అండ్ బర్న్ విభాగంలో అవార్డును గెలుచుకున్నట్లు నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (NASA) ఏప్రిల్ 22వ తేదీ ప్రకటించింది. అలాగే ముంబైకి చెందిన ద కనాకియా ఇంటర్నేషనల్ స్కూల్‌కు చెందిన విద్యార్థులు రూకీ ఆఫ్ ద ఇయర్ అవార్డును గెలుచుకున్నారు.
Bharat Ratna Awards: భారతరత్న అవార్డులు ప్రదానం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
కాగా ఈ పోటీలో అమెరికాలోని డాలస్‌కు చెందిన పారిష్ ఎపిస్కోపల్ స్కూల్ హైస్కూల్ విభాగంలో తొలి బహుమతి సాధించింది. అలాగే కాలేజీ, యూనివర్సిటీ విభాగంలో హంట్స్ విల్లేకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ అలబామా ప్రథమ బహుమతిని గెల్చుకుంది. ప్రపంచవ్యాప్తంగా 600 మందికిపైగా విద్యార్థులతో కూడిన 72 టీమ్స్ ఈ వార్షిక పోటీలో పాల్గొన్నాయి. అమెరికాలోని 24 రాష్ట్రాలతోపాటు డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా, ప్యూర్టోరికో, భారత్ సహా మరో 13 దేశాల నుంచి 42 కాలేజీలు, యూనివర్సిటీలు, 30 హైస్కూళ్ల విద్యార్థులు ఈ పోటీలో తన ప్రతిభను చాటారు.
John L Jack Swigert Jr Award: చంద్రయాన్-3 బృందానికి ప్రతిష్టాత్మక అవార్డు
Tags
- NASA
- NASA awards
- Indian students
- Human Exploration Rover Challenge
- Delhi-NCR and Mumbai
- KIET Group
- Kanakia International School
- Sakshi Education News
- SakshiEducationUpdates
- IndianStudents
- RoverChallenge
- NewDelhi
- Mumbai
- Awards
- Competitions
- SpaceCenter
- HuntsvilleAlabama
- achievement
- current affairs about awards
- sakshieducation updates