Coaching Center: మున్సిపల్‌ ​స్కూల్లో పాలిటెక్నిక్‌ కోచింగ్‌ సెంటర్‌..

విద్యార్థులు పదో తరగతి తర్వాత ఈ కోర్సుల్లో కోచింగ్‌ ఎంతో ఉపయోగపడుతుంది. దీని గురించి జిల్లా సైన్స్‌ అధికారి మైనం హుస్సేన్‌ మాట్లాడారు..

 

పాయకాపురం: పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులకు పాలిటెక్నిక్‌, ఏపీఆర్జేసీకి సంబంధించిన ఉచిత కోచింగ్‌ సెంటర్‌ను మంగళవారం పుచ్చలపల్లి సుందరయ్య మున్సిపల్‌ హైస్కూల్లో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా సైన్స్‌ అధికారి డాక్టర్‌ మైనం హుస్సేన్‌ మాట్లాడుతూ విద్యార్థులు పదో తరగతి తర్వాత జీవితంలో స్థిరపడడానికి మంచి విద్యను ఎన్నుకోవడానికి పాలిటెక్నిక్‌ ఏపీఆర్జేసీ లాంటి పరీక్షలకు కోచింగ్‌ సెంటర్‌ ఎంతో ఉపయోగపడుతుందన్నారు.

DTU Recruitment 2024: ఢిల్లీ టెక్నలాజికల్‌ యూనివర్శిటీలో 158 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

మ్యాథమెటిక్స్‌, భౌతికశాస్త్రానికి సంబంధించిన అనేక కాంపిటేటివ్‌ పరీక్షలకు బిట్స్‌ తయారుచేయడంతో మంచి నాలెడ్జి వస్తుందని తెలిపారు. 25 ఏళ్లుగా ఉచితంగా అనేక మంది విద్యార్థులకు ఉచితంగా కోచింగ్‌ ఇస్తున్నామని వివరించారు. ఈ నెల 23వ తేదీ వరకు ఉచిత కోచింగ్‌ సెంటర్‌ పనిచేస్తుందని విద్యార్థులు ఉపయోగించుకోవాలని సూచించారు.

Digital Library: నిరుద్యోగుల పోటీ పరీక్షలకు డిజిటల్‌ గ్రంథాలయ ఏర్పాటు..

#Tags