Digital Library: నిరుద్యోగుల పోటీ పరీక్షలకు డిజిటల్ గ్రంథాలయ ఏర్పాటు..
ఆదిలాబాద్: ఆండ్రాయిడ్ ఫోన్లు అందుబాటులోకి రావడం.. డిజిటలీకరణ పెరగడం.. ఎలక్ట్రానిక్ డివైజ్‌లు చౌకగా లభిస్తుండడంతో అన్ని రకాల సేవలు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటున్నాయి. ఫోన్‌లో మనకు కావాల్సిన సమాచారం క్షణాల్లో ప్రత్యక్షమవుతోంది. పలు రకాల సేవలు ఇంట్లో ఉండే పొందగలుగుతున్నాం. ఈ నేపథ్యంలో డిజిటల్ లైబ్రరీ కూడా అందుబాటులోకి వచ్చింది. దీంతో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు తమకు కావాల్సిన సమాచారం, స్టడీ మెరిటీయల్ ఇంట్లోనుండే పొందుతున్నారు. అరచేతిలో ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్‌లో చూసుకుంటున్నారు.
– నిర్మల్‌ఖిల్లా
NMDC Limited Recruitment 2024: ఎన్‌ఎండీసీ లిమిటెడ్‌లో 193 అప్రెంటిస్‌లు.. ఇంటర్వ్యూ తేదీలు ఇవే..
డిజిటల్ తోడ్పాటు..
రానున్న మూడు నాలుగు నెలల కాలం మొత్తం ఉద్యోగల పోటీ పరీక్షల షెడ్యూల్‌తోనే నిండిపోయి ఉంది. టెట్ మొదలుకుని డీఎస్సీ, టీఎస్పీఎస్సీ గ్రూప్స్ పరీక్షలు మొదలుకానున్నాయి. వరుస ఉద్యోగ ప్రకటనల నేపథ్యంలో అవకాశాన్ని వినియోగించుకోవడానికి ఉమ్మడి జిల్లా అభ్యర్థులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. జిల్లా కేంద్రాల్లోని గ్రంథాలయాలకు నిరుద్యోగుల తాకిడి పెరిగిపోవడమే దీనికి తార్కాణం. ఇక స్టడీహాళ్లలో స్థలం దొరకడం కూడా గగనంగా మారింది.
ప్రభుత్వ శాఖా గ్రంథాలయాలతో పాటు స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేస్తున్న లైబ్రరీలను కూడా నిరుద్యోగ అభ్యర్థులు వినియోగించుకుంటున్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంతో పాటు పలు ప్రాంతాలలో స్టడీ మెటీరియల్ సేకరణ కోసం డిజిటల్ గ్రంథాలయాలు కూడా తోడ్పడుతున్నాయి. ఏకకాలంలో పలు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు స్టడీ మెటీరియల్ పుస్తకాలు కొనడం ఆర్థిక భారంగా పరిణమిస్తోంది. ఈ నేపథ్యంలో జాతీయస్థాయిలో కేంద్ర మానవవనరుల శాఖ ఆధ్వర్యంలో ‘నేషనల్ డిజిటల్ లైబ్రరీ’ పేరుతో ఇంటర్నెట్‌లో సమగ్ర సమాచారాన్ని అందిస్తోంది.
Polycet 2024: పాలిసెట్ – 2024కు ఉచిత కోచింగ్
సమాచారం సమగ్రం..
డిజిటల్ వేదికను వినియోగించుకుంటే పోటీ పరీక్షల కోసం అవసరమయ్యే సంపూర్ణ సిలబస్ అందుబాటులో ఉంటుంది. ఇప్పటికే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, హెచ్‌డబ్ల్యూవో, డీఏవో, తదితర పోస్టుల పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. వీటితో పాటు జాతీయస్థాయిలో యూపీఎస్సీ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఆర్‌ఆర్‌బీ, బ్యాంకింగ్, తదితర సంస్థలు వరుస ఉద్యోగ నోటిఫికేషన్ల ద్వారా ఎప్పటికప్పుడు నియామకాలు చేస్తున్నాయి. వీటికి సంబంధించిన పూర్తి సమాచారం సిలబస్ కూడా డిజిటల్ వేదికగా అందుబాటులో ఉంచారు.
Tenth Class Public Exams Evaluation :నేటి నుంచి ‘పదో తరగతి’ స్పాట్ ..ఏర్పాట్లు పూర్తి
దాదాపు 70 లక్షల పుస్తకాలు
ఆయా పోటీ పరీక్షలకు ఉపయోగపడే దాదాపు 70 లక్షల పుస్తకాలను ఈ వెబ్‌సైట్‌లో నిక్షిప్తం చేశారు. ఎన్సీఈఆర్టీ రూపొందించిన వివిధ పాఠ్యాంశాలతో పాటు పలు ప్రముఖ యూనివర్సిటీలు రూపొందించిన పరిశోధన వ్యాసాలు, వివిధ రకాల ఉద్యోగ పరీక్షల సిలబస్ సబ్జెక్టు, విషయ పరిజ్ఞాన అంశాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 6 విభాగాలు ఉంటాయి. ఏ విభాగానికి సంబంధించిన పుస్తకం అవసరమో దానిపై క్లిక్ చేస్తే ఆయా పాఠ్యాంశాలకు సంబంధించిన డిజిటల్ పుస్తకాల పేజీలు ప్రత్యక్షమవుతాయి. వాటిని ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకుని అవసరమైన సమయంలో చదువుకోవచ్చు.
Pamphlets Advertising: రారండో మా పాఠశాలలో చేరండో.. అంటూ.. కరపత్రాలతో ప్రచారం..
సమాచార సేకరణ ఇలా..
కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ అనుమతితో ఖరగ్‌పూర్ ఐఐటీ సంస్థ ఆధ్వర్యంలో ఇంటర్‌నెట్‌లో https://ndl.iitkgp.ac.in/ అనే వెబ్‌సైట్‌లో ‘నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా’ పేరుతో డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేసింది. ఇందులో విషయ నిపుణుల వీడియోలు కూడా ఉన్నాయి. పాఠశాల, కళాశాల, ఇంజనీరింగ్, వైద్య, న్యాయవిద్య, సాహిత్యం, సంస్కృతం.. ఇలా అన్ని రకాల స్టడీ మెటీరియల్‌ను ఇంగ్లిష్, హిందీతో పాటు ప్రాంతీయ భాషల్లో ఆన్‌లైన్‌లో నిక్షిప్తం చేశారు. పాఠశాల పుస్తకాలు ('సీబీఎస్‌ఈ' సిలబస్), ఇంజనీరింగ్ పుస్తకాలు, లిట్రేచర్, మెడిసిన్, లా మేనేజ్‌మెంట్, ఇతర గ్రంథాలు, వివిధ రకాల పుస్తకాలు వివిధ భాషల్లో అందుబాటులోకి తీసుకువచ్చారు.
ఈ పుస్తకాలన్నీ పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఉండగా వెబ్‌సైట్ ఓపెన్ చేసి చదువుకోవచ్చు. లేదా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కాగా స్మార్ట్ ఫోన్, ల్యాప్‌టాప్ లేదా డెస్క్‌టాప్ కంప్యూటర్‌ల ద్వారా డిజిటల్ లైబ్రరీని వినియోగించుకునేలా తీర్చిదిద్దారు. ఇంటర్‌నెట్ గూగుల్‌లో ‘నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా’ అని టైప్ చేస్తే డిజిటల్ లైబ్రరీ తెరుచుకుంటుంది. ఈమెయిల్ ఐడీ ద్వారా లాగిన్ అయి రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మనకు కావాల్సిన అంశాలను ఎంచుకుని చదువుకోవచ్చు. లేదా డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయం ఉంటుంది.
Gurukul School Principal: ప్రిన్సిపాల్‌పై విద్యార్థులు, అధ్యాపకుల ఫిర్యాదు..! కారణం..