Polycet 2024: పాలిసెట్ – 2024కు ఉచిత కోచింగ్
పాలిసెట్ – 2024కు ఉచిత కోచింగ్ అందజేసి స్టడీ మెటీరియల్ కూడా అందజేయనున్నట్లు శ్రీకాకుళం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ గురుగుబెల్లి దామోదర్‌రావు, పాలిసెట్ సెట్ జిల్లా కన్వీనర్ పి.యుగంధర్‌రావు తెలిపారు. మంగళవారం శ్రీకాకుళం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో వివరాలు వెల్లడించారు. జిల్లాలో ఐదు ప్రభుత్వ, ఐదు ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలలు ఉన్నాయని చెప్పారు. ఈ నెల 27న ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పాలిసెట్ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ నెల 5వ తేదీతో దరఖాస్తుల స్వీకరణ ముగుస్తుందన్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరణ కొనసాగుతోందని, శ్రీకాకుళం, టెక్కలి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో సహాయ కేంద్రాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆధార్ కార్డు, 10వ తరగతి హాల్ టిక్కెట్ ఆధారంగా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. శ్రీకాకుళం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈ నెల 1 నుంచి ఉచిత కోచింగ్ ప్రారంభమైందని, ఈ నెల 25 వరకు కోచింగ్ ఉంటుందని తెలిపారు. వారాంతపు మోడల్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గణితం, రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రం స్టడీ మెటీరియల్ విద్యార్థులకు అందజేస్తున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు 9912342008 నంబర్‌ను సంప్రదించాలని చెప్పారు.
Also Read: POLYCET Previous Papers