Skip to main content

Schools Summer Holidays 2024 Update News : స్కూళ్ల‌ వేసవి సెలవుల‌పై.. విద్యాశాఖ మ‌రో కీల‌క ఆదేశం.. అలాగే వార్షిక ప‌రీక్ష‌లు కూడా..

సాక్షి ఎడ్యుకేష‌న్ : రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండ‌లు మండుతున్నాయి. ఎల్‌నినో ప్రభావంతో ఏప్రిల్‌, మే నెలలో రాష్ట్రవ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
Andhra Pradesh Education Department announces summer vacations  school summer holidays and final exams details  Important orders issued by AP Education Department on final exams

ఇప్ప‌టికే ఆంధ్రప్రదేశ్‌లో సూళ్ల‌కు ప్ర‌భుత్వం వేసవి సెలవులపై అధికారికంగా ప్ర‌క‌టించిన విష‌యం తెల్సిందే.

వార్షిక ప‌రీక్ష‌లు ఇలా..

ఈ నేప‌థ్యంలో.. ఏపీ విద్యాశాఖ ఫైన‌ల్ ప‌రీక్ష‌ల‌పై కీల‌క ఆదేశాల‌ను జారీ చేసింది. 1వ త‌ర‌గ‌తి నుంచి 9వ త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు వార్షిక ప‌రీక్ష‌లను ఏప్రిల్ 6వ తేదీ నుంచి ఏప్రిల్ 19వ తేదీ వ‌ర‌కు నిర్వ‌హించాల‌ని కీల‌క ఆదేశాల‌ను జారీ చేసింది. అలాగే ఈ ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన మూల్యాంకనం ఏప్రిల్ 19వ తేదీ నుంచి 21వ తేదీ లోపు జవాబు పత్రాల మూల్యాంకనం చేయాల్సి ఉంటుంది. ఏపిల్ 23వ తేదీన అన‌గా.. చివరి రోజున ప్రోగ్రెస్‌ కార్డులు విద్యార్థులకు అందజేయ‌ల‌న్నారు.

ప‌రీక్షల తేదీలు ఇవే..

ఏప్రిల్‌ 6వ తేదీన‌ 1–9 తరగతులకు మొదటి లాంగ్వేజ్‌, ఏప్రిల్ 8వ తేదీ 1–5 తరగతులకు ఇంగ్లిష్‌ పార్ట్‌–ఏ, 6వ త‌ర‌గ‌తి నుంచి 9 తరగతులకు సెకండ్‌ లాంగ్వేజ్‌, ఏప్రిల్ 10వ తేదీ 1–5 తరగతులకు ఇంగ్లిష్‌ పార్ట్‌–బీ (టోఫెల్‌), 6 నుంచి 9 తరగతులకు ఇంగ్లిష్‌ పార్ట్‌–ఏ, ఏప్రిల్ 12వ తేదీ 1–5 తరగతులకు గణితం, 6–9 తరగతులకు ఇంగ్లిష్‌ పార్ట్‌–బీ (టోఫెల్‌), 13వ తేదీ 3–5 తరగతులకు ఈవీఎస్‌, 6–9 తరగతులకు గణితం, 15వ తేదీ 3–5 తరగతులకు ఓఎస్‌ఎస్సీ, 6 నుంచి9 తరగతులకు ఫిజికల్‌ సైన్స్‌, 16వ తేదీ 4వ తరగతి విద్యార్థులకు (ఎంపిక చేసిన స్కూళ్లు) స్లాస్‌–2024 పరీక్ష, 6 నుంచి 9 తరగతుల విద్యార్థులకు బయాలజికల్‌ సైన్స్‌, 18న సోషల్‌ పరీక్ష ఉంటుంది. 1–8 తరగతుల విద్యార్థులకు రోజూ ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, 9వ తరగతి విద్యార్థులకు 9 నుంచి 12.15 గంటల వరకు పరీక్ష సమయం కేటాయించారు.

భారీగా వేస‌వి సెల‌వులు ఇలా..
అన్ని ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ స్కూళ్లకు సెలవులకు ఏప్రిల్‌ 23వ తేదీన చివ‌రి దినంగా ప్ర‌భుత్వం తెలిపింది. అలాగే ఏప్రిల్ 24వ తేదీ (బుధ‌వారం) నుంచి అన్ని ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ స్కూళ్లకు సెలవులు ఇస్తున్నట్లు ఏపీ విద్యాశాఖ ప్రకటించింది. అన్ని ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ స్కూళ్లకు జూన్ 11వ తేదీ (మంగ‌ళ‌వారం) వరకు వేసవి సెలవులు ఉంటాయి విద్యాశాఖ ప్ర‌క‌టించింది. 

జూన్ 12వ తేదీ నుంచి..
తిరిగి ఈ స్కూల్స్ జూన్ 12వ తేదీ (బుధ‌వారం)  పున:ప్రారంభం అవుతాయ‌ని ఉత్త‌ర్వుల్లో ప్ర‌భుత్వం పేర్కొంది. ఈ వేర‌కు స్కూళ్ల విభాగం కార్యదర్శి సురేష్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. అంటే స్కూల్స్‌కు దాదాపు 48 రోజులు పాటు సెల‌వులు ఇచ్చారు. ఇప్ప‌టికే టెన్త్ విద్యార్థులకు, ఇంట‌ర్ విద్యార్థుల‌కు వేస‌వి సెల‌వులు ఇచ్చిన విష‌యం తెల్సిందే.

Published date : 03 Apr 2024 03:03PM

Photo Stories