Skip to main content

Pamphlets Advertising: రారండో మా పాఠశాలలో చేరండో.. అంటూ.. కరపత్రాలతో ప్రచారం..

ఈ మధ్య కాలంలో అందరూ సోషల్‌ మీడియా ప్రచార వేదికగా మార్చుకుంటున్నారు. అయితే, ఒక పాఠశాల ప్రిన్సిపాల్‌ కరపత్రాలతో ప్రచారం చేస్తూ ప్రవేశాలకు ఆహ్వానం పలుకుతున్నారు ఇలా..
School principal promoting education  Advertising for admissions at Model Schools with Pamphlets  Invitation to join our school community

 

జూపాడుబంగ్లా: ఒకప్పుడు ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు ‘మా స్కూల్‌, కాలేజీల్లో చేరండి’ అంటూ వాల్‌పోస్టర్లు, ప్రకటనలతో ప్రచారం చేసుకుంటారు. కార్పొరేట్‌ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సౌకర్యాలు కల్పించిన తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది.

ISO Certification: ఏపీఎస్‌ఎస్‌డీసీకి ఐఎస్‌ఓ గుర్తింపు

ఈ నేపథ్యంలో జూపాడుబంగ్లా మోడల్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ రమేష్‌ కరపత్రాలను ముద్రించి తమ పాఠశాలలో చేరితే ఉచితంగా పాఠ్యపుస్తకాలు, దుస్తులు, డిజిటల్‌ తరగతి గదులు, ఆధునిక ఐఎఫ్‌పీ ప్యానల్స్‌ ద్వారా నాణ్యమైన ఆంగ్ల విద్యాబోధన, 9 నుంచి 12 తరగతుల వరకు ఉచితంగా ఒకేషనల్‌ కోర్సులు, సువిశాలమైన ఆటస్థలం, లైబ్రరీ, ఎన్‌ఎంఎంఎస్‌ స్కాలర్‌షిప్‌కు శిక్షణ వంటి అనేక వసతులున్నాయని ప్రచారం చేస్తున్నారు.

Gurukul School Principal: ప్రిన్సిపాల్‌పై విద్యార్థులు, అధ్యాపకుల ఫిర్యాదు..! కారణం..

2024–25 ఏడాదికిగాను ఆరో తరగతిలో చేరేవారికి ఈనెల 21న అర్హత పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. పాఠశాలలో ఇప్పటికే అన్ని తరగతుల్లో గరిష్ట స్థాయిలో విద్యార్థులుండగా ఖాళీగా ఉన్న సీట్లలో ఆసక్తి ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులు మోడల్‌ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలని కరపత్రాలను పంపిణీ చేస్తూ ప్రచారం చేస్తున్నారు.

Work From Office: ఉద్యోగులను ఆఫీస్‌కి రప్పించడానికి మరో ఎత్తు వేసిన ఐటీ కంపెనీ!!

Published date : 03 Apr 2024 03:45PM

Photo Stories