Food Technology: ఎన్జీ రంగా వ‌జ్రోత్స‌వ వేడుక‌ల్లో సెమినార్

వ‌జ్రోత్స‌వ వేడుక‌ల్లో భాగంగా ఫుడ్ టెక్నాల‌జీ అంశంపై సెమినార్ నిర్వ‌హించి, ప్రొఫెస‌ర్లు, అధికారులు మాట్లాడారు. వేడుక‌ల్లో వారు తెలిపిన అభిప్రాయాలు, సూచ‌న‌లు తెలుసుకుందాం..
Students and professors at diamond Jubilee celebrations of NG Ranga

సాక్షి ఎడ్యుకేష‌న్: ఫుడ్‌ టెక్నాలజీకి ఉజ్వల భవిష్యత్‌ ఉందని వ్యవసాయ ఇంజినీరింగ్‌ కళాశాల డీన్‌ డాక్టర్‌ ఎ.మణి పేర్కొన్నారు. ఎన్జీ రంగా వజ్రోత్సవాల్లో భాగంగా ‘ఫుడ్‌ టెక్నాలజిస్టులకు అవకాశాలు– పూర్వ విద్యార్థులచే దిశానిర్దేశం‘ అనే అంశంపై ఆహార విజ్ఞాన శాస్త్ర సాంకేతిక కళాశాలలో శనివారం సెమినార్‌ నిర్వహించారు.

Skill Hub: యువ‌త‌కు ఉపాధి కోసం స్కిల్‌హబ్‌లు

డాక్టర్‌ ఎ.మణి మాట్లాడుతూ ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆహార విజ్ఞాన– సాంకేతిక కళాశాల ఆధ్వర్యంలో పూర్వ విద్యార్థులచే ఫుడ్‌ టెక్నాలజిస్టులకు గల అవకాశాలను తెలియజేశారు. ఫుడ్‌టెక్నాలజి కళాశాల డీన్‌ డాక్టర్‌ వై.రాధ మాట్లాడుతూ ప్రస్తుత విద్యార్థులు ఆచరించదగిన విధి విధానాలను వివరించారు.

Admissions: ఐటీఐలో మిగులు సీట్ల భర్తీకి దరఖాస్తులు

పూర్వ విద్యార్థులు తమ అనుభవాలను పంచుకోవడం ఆనందంగా ఉందన్నారు. డీన్‌ ఆఫ్‌ స్టూడెంట్స్‌ ఆక్టివిటీస్‌ డాక్టర్‌ పి.సాంబశివరావు, డాక్టర్‌ స్మిత్‌, డాక్టర్‌ సి.సుకుమారన్‌, డాక్టర్‌ వి.రామసుబ్బారావు, సీహెచ్‌వీవీ సత్యనారాయణ, సోమేశ్వరరావు, విమలబీర, బ్లేస్సిసాగర్‌ తదితరులు పాల్గొన్నారు.
 

#Tags