ANGRAU: ‘ఈ–రిసోర్సెస్’లో ఎన్జీరంగా వర్సిటీకి స్కోచ్ అవార్డు
Sakshi Education
గుంటూరు రూరల్: జాతీయస్థాయిలో ఉత్తమ ఈ– రిసోర్సెస్ వినియోగంలో మొదటిస్థానం లభించిన ట్లు ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ వర్సిటీ వీసీ డాక్టర్ విష్ణువర్ధన్‌రెడ్డి నవంబర్ 23న తెలిపారు.
వ్యవసాయ విద్య, పరిశోధన, విస్తరణ విభాగాలకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్(ఐసీఏఆర్) ఈ అవార్డును 2021 సంవత్సరానికి గానూ ప్రకటించిందన్నారు. ఈ అవార్డును పొందిన విశ్వవిద్యాలయాన్ని ఐసీఏఆర్ డీడీజీ డాక్టర్ ఆర్‌సీ అగర్వాల్ ప్రత్యేకంగా అభినందించినట్లు చెప్పారు.
చదవండి:
ANGRAU: బీఎస్సీలో ‘ఎన్‌ఆర్‌ఐ’ సీట్ల దరఖాస్తుకు గడువు పెంపు
Published date : 24 Nov 2022 04:00PM