Skip to main content

Admissions: ఐటీఐలో మిగులు సీట్ల భర్తీకి దరఖాస్తులు

మన్ననూర్‌: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పారిశ్రామిక శిక్షణా సంస్థల్లో (ఐటీఐ) 2023–24/25 విద్యా సంవత్సరాలకు గానూ ఐటీఐ, ఆర్‌ఐటీఐ, మైనార్టీ, ప్రైవేటు ఐటీఐలో మిగులుగా ఉన్న ట్రేడుల్లో సీట్లు భర్తీ చేసేందుకు నాలుగో విడత దరఖాస్తులు స్వీకరించనున్నట్లు మన్ననూర్‌ ఆర్‌ఐటీఐ ప్రిన్సిపాల్‌ జయమ్మ సెప్టెంబ‌ర్ 16న‌ ఒక ప్రకటనలో తెలిపారు.
Admissions
ఐటీఐలో మిగులు సీట్ల భర్తీకి దరఖాస్తులు

 అర్హత ఆసక్తి కలిగిన విద్యార్థుల నుంచి సెప్టెంబ‌ర్ 14వ తేదీ నుంచి 20వ తేదీ లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు తమ అర్హతను తెలియజేసే ధ్రువపత్రాలు ఎస్‌ఎస్‌సీ, కుల, స్థానిక, టీసీతో పాటూ పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోను స్కాన్‌ చేసి http://iti.telangana,gov.in అనే వెబ్‌సైట్‌ లో మోబైల్‌ నంబర్‌తో రిజిష్టర్‌ చేసుకోవాలని సూచించారు. కనీసం ఆరో తరగతి వరకు తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాలల్లో విద్యాభ్యాసం చేసి ఉంటేనే స్థానికులుగా గుర్తిస్తారన్నారు.

చదవండి: Career in ISRO: అంతరిక్ష పరిశోధన సంస్థలో కెరీర్‌కు మార్గాలు

ఇప్పటికే 1, 2, 3 దశల్లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు నాలుగో విడతలో మళ్లీ దరఖాస్తు చేసుకోనవసరం లేదన్నారు. నమోదు చేసుకున్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రింట్‌ కాపీతో పాటూ ఒరిజనల్‌ ధ్రువపత్రాలతో ఇంటర్‌వ్యూకు హాజరుకావాలన్నారు. పూర్తి వివరాలకు 9603012267, 6300619644 సెల్‌ ఫోన్‌ నంబర్లను సంప్రదించాలని సూచించారు.

చదవండి: Free training at Skill Hub: స్కిల్‌ హబ్‌లో ఉచిత శిక్షణ

Published date : 19 Sep 2023 03:07PM

Photo Stories