Skip to main content

Free Hostel : సివిల్స్ అభ్య‌ర్థుల‌కు ఉచిత హాస్ట‌ల్ వ‌స‌తి..!

Free hostel facility for civils exam candidates

గుంటూరు: యూపీఎస్సీ నిర్వహించే సివిల్స్‌కు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు ఉచిత హాస్టల్‌ వసతి కల్పిస్తున్నట్లు హైదరాబాద్‌కు చెందిన రిఫ్లెక్షన్స్‌ ఐఏఎస్‌ అకాడమీ వ్యవస్థాపకుడు, సివిల్స్‌ విజేత డాక్టర్‌ జి.వివేకానంద శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన అభ్యర్థులకు వసతి ఖర్చులు అదనపు భారం కారాదనే సామాజిక బాధ్యతతో సేవలందిస్తున్న శ్రీకాకతీయ ఎడ్యుకేషనల్‌ అకాడమీ సహకారంతో 90 మందికి ఉచిత హాస్టల్‌ వసతి కల్పిస్తామని పేర్కొన్నారు.

International Law: పాలస్తీనాను అధీనంలో ఉంచుకోవడం చట్టవిరుద్ధం

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో అభ్యర్థులకు సివిల్స్‌లో ర్యాంకుల సాధనే లక్ష్యంగా ప్రారంభిస్తున్న రెసిడెన్షియల్‌ క్యాంపస్‌లో మెరిట్‌ ప్రాతిపదికన యువతీ, యువకులకు చెరో 45 సీట్లు చొప్పున కేటాయిస్తామని తెలిపారు. గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన ఆశావహులు ఉచిత హాస్టల్‌ వసతి కోసం తమ పూర్తి వివరాలను 98660 74047 నంబర్‌కు వాట్సాప్‌ చేయాలని ఆయన సూచించారు.

UPSC Civil Prelims Results 2024: యూపీఎస్సీ సివిల్స్‌ ప్రిలిమ్స్‌కు ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదల..

Published date : 20 Jul 2024 05:26PM

Photo Stories