Free training at Skill Hub: స్కిల్ హబ్‌లో ఉచిత శిక్షణ
విజయనగరం అర్బన్: ఉపాధి, ఉద్యోగావకాశాలున్న వివిధ కోర్సులకు స్కిల్ హబ్స్ ద్వారా ఉచిత శిక్షణ అందజేస్తామని ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఏపీరాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా అధికారి డాక్టర్ ఎన్.గోవిందరావు తెలిపారు. రెండు నెలల కాలవ్యవధి ఉన్న అసిస్టెంట్ సర్వేయర్ కోర్సుకు ఇంటర్‌మీడియట్/డిగ్రీ విద్యార్హత ఉండాలని, మూడు నెలల కాలవ్యవధి ఉన్న అసిస్టెంట్ ప్లంబర్ జనరల్ కోర్సుకు 8వ తరగతి/ఐటీఐ ఫిట్టర్ విద్యార్హత ఉండాలని ఈ కోర్సులో చేరే అభ్యర్థులకు స్థానిక కేంద్రియ యూనివర్సిటీ ప్రాంగణంలోని స్కిల్ హబ్‌లో శిక్షణ ఇస్తామన్నారు.
అదేవిధంగా రెండునెల కాలవ్యవధి కోర్సులలో అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్ కోర్సుకు పదోతరగతి/ఐటీఐ విద్యార్హత, హెల్పర్ మేషన్ కోర్సుకు 5వ తరగతి ఆపై విద్యార్హత ఉంటే సరిపోతుందని వాటికి శిక్షణ స్థానిక బీసీ కాలనీలోని న్యాక్ (ఎన్‌ఏసీ) శిక్షణాకేంద్రంలోని స్కిల్ హబ్‌లో ఇస్తామని తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు పూర్తి వివరాల కోసం ఫోన్ 9652515251, 7075342406, 9866564273 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.