Skip to main content

AP EAPCET 2024 Counselling : ముగిసిన ఏపీఈఏపీసెట్ తొలి విడ‌త కౌన్సెలింగ్.. నేటి నుంచే త‌ర‌గ‌తులు ప్రారంభం..!

End of first sessions counselling for AP EAPCET 2024 B Tech Admissions

అనంతపురం: ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్‌ కౌన్సెలింగ్‌లో తొలి విడత సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. విద్యార్థులు ఈ నెల 22వ తేదీలోపు నేరుగా కళాశాలల్లో రిపోర్టు చేయాలి. అయితే ఈ నెల 19 నుంచే తరగతులు ప్రారంభం కానున్నాయి. జేఎన్‌టీయూ(ఏ) క్యాంపస్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో 396 సీట్లు ఉండగా 389 సీట్లు, ఎస్కేయూ ఇంజినీరింగ్‌ కళాశాలలో 330 సీట్లకు గాను 255 భర్తీ అయ్యాయి. జేఎన్‌టీయూ(ఏ)లో మొత్తం 6 విభాగాలు ఉండగా ప్రతి విభాగంలో 66 చొప్పున సీట్లు ఉన్నాయి. కెమికల్‌ ఇంజినీరింగ్‌లో 65, సివిల్‌ ఇంజినీరింగ్‌ 64, కంప్యూటర్‌ సైన్సెస్‌ 66, ఈసీఈ 65, ఈఈఈ 64, మెకానికల్‌ విభాగంలో 65 సీట్లు భర్తీ అయ్యాయి.

Corporation Chairpersons: తెలంగాణ కార్పొరేషన్‌ చైర్‌ప‌ర్స‌న్స్‌గా బాధ్యతలు స్వీకరించిన నాలుగురు వీరే..

బ్రాంచ్‌ కన్నా కళాశాలే ముఖ్యం..

గతేడాది కంప్యూటర్‌ సైన్సెస్‌ కోర్సుల వైపు అత్యధిక శాతం విద్యార్థులు ఆసక్తి చూపించారు. దీంతో కంప్యూటర్‌ సైన్సెస్‌ వాటి అనుబంధ కోర్సులకు అప్పట్లో భారీ డిమాండ్‌ నెలకొంది. తాజాగా ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థుల వైఖరిలో స్పష్టమైన మార్పు వచ్చింది. కోర్సు కంటే కళాశాల వైపు మొగ్గు చూపుతున్నారు. నాణ్యత ప్రమాణాలు గల కళాశాలలో సీటు దక్కితే చాలు బ్రాంచ్‌ ఏదైనా పర్వాలేదనే ధోరణి వ్యక్తమవుతోంది. దీంతో ఈ విద్యా సంవత్సరంలో కంప్యూటర్‌ సైన్సెస్‌తో పాటు కోర్‌ బ్రాంచ్‌లు అయిన ఈసీఈ, ఈఈఈ, మెకానికల్‌, సివిల్‌ కోర్సులకూ డిమాండ్‌ నెలకొంది.

Union Budget: ఆర్థికమంత్రిఅందుబాటులో లేకుంటే.. బడ్జెట్‌ను ఎవరు ప్రవేశపెడ‌తారో మీకు తెలుసా?

మంచి ర్యాంక్‌ వచ్చిన విద్యార్థులు తమ తొలి ప్రాధాన్యతగా కంప్యూటర్‌ సైన్సెస్‌కు ఆప్షన్‌ ఇచ్చారు. జేఎన్‌టీయూ (ఏ) క్యాంపస్‌ కళాశాలలో కంప్యూటర్‌ సైన్సెస్‌ బ్రాంచ్‌కు సంబంధించి తొలి ఐదు సీట్లను రాష్ట్ర స్థాయిలో 889, 1013, 1221, 1446, 1502 ర్యాంకులు సాధించిన వారు దక్కించుకున్నారు. ఈసీఈ విభాగంలో 1,871, 2,077, 2,409, 2,805, 2,977 ర్యాంకుల వారికి తొలి ఐదు సీట్లు దక్కాయి. ఎస్‌ఆర్‌ఐటీ (అటానమస్‌)లో 10,949 నుంచి 12,751 లోపు ర్యాంకు వారికి సీఎస్‌ఈ సీట్లు దక్కాయి.

Jobs: వైద్యారోగ్యశాఖలో పెండింగ్‌లో ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు కసరత్తు

Published date : 20 Jul 2024 08:56AM

Photo Stories