Bala Bhavan : ప్రతిభను వెలికితీసేందుకే సెమినార్‌లు
Sakshi Education
సూర్యాపేట టౌన్: సమాజం పట్ల, వివిధ అంశాల పట్ల విద్యార్థులకు ఉన్న ప్రతిభాపాటవాలను వెలికితీసేందుకు సెమినార్‌లు ఎంతగానో ఉపయోగపడతాయని జిల్లా సైన్స్ అధికారి ఎల్.దేవరాజు అన్నారు.
విద్యార్థినికి బహుమతి అందజేస్తున్న జిల్లా సైన్స్ అధికారి దేవరాజ్
శుక్రవారం జిల్లా కేంద్రంలోని బాలభవన్‌లో చిరుధాన్యాలు ఆరోగ్యకరమైన ఆహారమా.. లేక వ్యామోహ ఆహారమా? అనే అంశంపై విద్యార్థులకు జిల్లా స్థాయి సెమినార్ నిర్వహించారు. ఈ సెమినార్‌లో ప్రతిభ కనబరిచిన ఎం.పల్లవి, ఎం.దీక్షితలకు బహుమతులు అందజేసి అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు ఈ నెల 19న హైదరాబాద్‌లో ఎస్‌సీఆర్‌టీ ఆడిటోరియంలో నిర్వహించే కార్యక్రమానికి హాజరు కావాలన్నారు.