FADEE Notification 2024 : ఎఫ్‌ఏడీఈఈ–2024 నోటిఫికేషన్‌ విడుదల.. ఈ కోర్సులు పూర్తి చేసుకుంటే వినూత్న కెరీర్స్‌

చిత్రలేఖనం, ఫొటోగ్రఫీ, శిల్పకళ.. వంటి ఫైన్‌ ఆర్ట్స్‌ కోర్సులకు వేదికగా నిలుస్తోంది.. హైదరాబాద్‌లోని జవహర్‌లాల్‌ నెహ్రూ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైనార్ట్స్‌ యూనివర్సిటీ!

ఈ కోర్సుల్లో ప్రవేశానికి ఫైన్‌ ఆర్ట్స్‌ అండ్‌ డిజైన్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (ఎఫ్‌ఏడీఈఈ) నిర్వహిస్తోంది. ఈ పరీక్షలో స్కోర్‌ ఆధారంగా జేఎన్‌ఏఎఫ్‌ఏయూ పరిధిలోని ఫైన్‌ ఆర్ట్స్‌ కోర్సుల్లో చేరొచ్చు!! తాజాగా 2024–25 విద్యాసంవత్సరానికి సంబంధించి ఎఫ్‌ఏడీఈఈ–2024 నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ నేపథ్యంలో.. ఎఫ్‌ఏడీఈఈ వివరాలు, ఎంపిక విధానం, అందుబాటులో ఉన్న కోర్సులు, సీట్లు, రాత పరీక్షకు ప్రిపరేషన్‌ తదితర వివరాలు..  

కొంత మంది విద్యార్థులకు చిన్నప్పటి నుంచి కళలు అంటే ఆసక్తి ఉంటుంది. వారు ఎప్పుడూ పెయింటింగ్, ఫొటోగ్రఫీ వంటి వాటిపై మక్కువ చూపుతారు. అలాంటి విద్యార్థులు తమకు ఇష్టమైన విభాగాల్లో కెరీర్‌ అవకాశాలు సొంతం చేసుకోవడానికి మార్గంగా నిలుస్తున్నాయి ఫైన్‌ ఆర్ట్స్‌ కోర్సులు.

Permanent Based Posts at BEL : 'బెల్‌'లో శాశ్వ‌త ప్రాతిప‌దిక‌న పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తులు.. చివ‌రి తేదీ!

ఫైన్‌ ఆర్ట్స్‌కు ప్రత్యేకం.. జేఎన్‌ఏఎఫ్‌ఏయూ
ఫైన్‌ ఆర్ట్స్‌కు సంబంధించి పలు విభాగాల్లో బ్యాచిలర్, పీజీ స్థాయి కోర్సులను అందించడంలో హైదరాబాద్‌లోని జవహర్‌లాల్‌ నెహ్రూ ఫైన్‌ ఆర్ట్స్‌ అండ్‌ ఆర్కిటెక్చర్‌ యూనివర్సిటీకి జాతీయ స్థాయిలో ప్రత్యేకత గుర్తింపు ఉంది. ఈ వర్సిటీలోని ఫైన్‌ ఆర్ట్స్‌ విభాగం పరిధిలో ప్రతి ఏటా పలు బ్యాచిలర్‌ కోర్సులకు ప్రవేశాలు చేపడతారు. ఇందుకోసం ఫైన్‌ ఆర్ట్స్‌ అండ్‌ డిజైన్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌(ఎఫ్‌ఏడీఈఈ)ను నిర్వహిస్తారు. ఇందులో స్కోర్‌ ఆధారంగా ఆయా విభాగాల్లో సీట్లు భర్తీ చేస్తారు. ప్రస్తుతం 2024–25 ప్రవేశాలకు ఎఫ్‌ఏడీఈఈ నోటిఫికేషన్‌ విడుదలైంది.

అర్హతలు
    ఇంటర్మీడియెట్‌ లేదా తత్సమాన ఉత్తీర్ణత ఉండాలి.

ఆరు కోర్సులు.. 275 సీట్లు

  •     ప్రస్తుతం ఎఫ్‌ఏడీఈఈ ద్వారా 6 కోర్సు­ల్లో 275 సీట్లు అందుబాటులో ఉన్నాయి. 
  •     బీఎఫ్‌ఏ అప్లయిడ్‌ ఆర్ట్స్‌ అండ్‌ విజువల్‌ కమ్యూనికేషన్‌–రెగ్యులర్‌ సీట్లుæ–35; సెల్ఫ్‌ సపోర్టింగ్‌ స్ట్రక్చర్‌ సీట్లు–15.
  •     బీఎఫ్‌ఏ పెయింటింగ్‌–రెగ్యులర్‌ సీట్లు–20; సెల్ఫ్‌ సపోర్టింగ్‌ స్ట్రక్చర్‌ సీట్లు–15.
  •     బీఎఫ్‌ఏ స్కల్ప్‌చర్‌–రెగ్యులర్‌ సీట్లు–10, సెల్ఫ్‌ సపోర్టింగ్‌ స్ట్రక్చర్‌ సీట్లు–10.
  •     బీఎఫ్‌ఏ(యానిమేషన్‌ అండ్‌ వీఎఫ్‌ఎక్స్‌)–సెల్ఫ్‌ సపోర్టింగ్‌ స్ట్రక్చర్‌ సీట్లు –60. 
  •     బీఎఫ్‌ఏ ఫొటోగ్రఫీ అండ్‌ విజువల్‌ కమ్యూనికేషన్‌–రెగ్యులర్‌ సీట్లు–30,సెల్ఫ్‌ సపోర్టింగ్‌ సపోర్టింగ్‌ స్ట్రక్చర్‌ సీట్లు–20.
  •     బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌(ఇంటీరియర్‌ డిజైన్‌)–సెల్ఫ్‌ సపోర్టింగ్‌ స్ట్రక్చర్‌ సీట్లు–60.

Contract Based Posts : ఈ బ్యాంకులో ఒప్పంద ప్రాతిప‌దిక‌న వివిధ పోస్టులకు ద‌ర‌ఖాస్తులు..

ఎఫ్‌ఏడీఈఈ ఇలా

  •     ఫైన్‌ ఆర్ట్స్‌ విభాగంలో పలు కోర్సులు అందుబాటులో ఉన్న నేపథ్యంలో.. ఎఫ్‌ఏడీఈఈని కూడా ఆయా కోర్సులకు అనుగుణంగా వేర్వేరు విధానాల్లో నిర్వహిస్తారు. 
  •     బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌–(అప్లయిడ్‌ ఆర్ట్, పెయింటింగ్, స్కల్ప్‌చర్‌ అండ్‌ యానిమేషన్‌) పరీక్షలో.. పేపర్‌ ఏ మెమొరీ డ్రాయింగ్‌ అండ్‌ కలరింగ్‌ వంద మార్కులు–90 నిమిషాలు, పేపర్‌ బి ఆబ్జెక్టివ్‌ టైప్‌ 50 మార్కులు–50 నిమిషాలు, పేపర్‌ సి ఆబ్జెక్ట్‌ డ్రాయింగ్‌ వంద మార్కులు–90 నిమిషాల వ్యవధిలో పరీక్ష జరుగుతుంది. 
  •     బీఎఫ్‌ఏ ఫోటోగ్రఫీ పరీక్షలో.. పేపర్‌ డి కంపోజిషన్‌ అండ్‌ విజువల్‌ కంపోజిషన్‌ అండ్‌ విజువల్‌ కమ్యూనికేషన్‌ 100 మార్కులు–90 నిమిషాలు, పేపర్‌ ఇ ఆబ్జెక్టివ్‌ టైప్‌ 50 మార్కులు–50 నిమిషాల వ్యవధిలో పరీక్ష ఉంటుంది. 
  •     బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌ (ఇంటీరియర్‌ డిజైన్‌)లో.. పేపర్‌ ఎఫ్‌ 200 మార్కులకు 3 గంటల వ్యవధిలో నిర్వహిస్తారు. 


ఈ అంశాలపై దృష్టి
ఎఫ్‌ఏడీఈఈలో మంచి స్కోర్‌ కోసం అభ్యర్థులు పేపర్ల వారీగా నిర్దేశిత అంశాలపై దృష్టి పెట్టాలి. డ్రాయింగ్‌ అండ్‌ కలరింగ్‌ స్కిల్స్, ఆబ్జెక్ట్‌ డ్రాయింగ్‌ స్కిల్స్, విజువల్‌ కమ్యూనికేషన్‌ స్కిల్స్, బేసిక్‌ ఫొటోగ్రఫీ టెక్నిక్స్, ప్రిన్సిపుల్స్‌; ఆర్ట్స్‌ అండ్‌ డిజైన్‌లో బేసిక్‌ కాన్సెప్ట్స్, ప్రిన్సిపుల్స్‌; వెర్బల్, నాన్‌–వెర్బల్‌ కమ్యూనికేషన్‌ స్కిల్స్, కలర్స్‌ యూసేజ్‌ వంటి వాటిపై దృష్టి పెట్టాలి. 

AP TET 2024 Results: నేడే ఏపీ టెట్‌ ఫలితాలు.. ఒకే ఒక్క క్లిక్‌తో రిజల్ట్స్‌ ఇలా చెక్‌ చేసుకోండి

ప్రాక్టీస్‌కు ప్రాధాన్యం
ప్రిపరేషన్‌ సమయంలో అభ్యర్థులు ప్రాక్టీస్‌కు అధిక ప్రాధాన్యమివ్వాలి. ఎందుకంటే.. పరీక్షలో అడిగే ప్రశ్నలు విద్యార్థుల్లోని సృజనాత్మకతను, విజువల్‌ థింకింగ్‌ నైపుణ్యాలను పరిశీలించేలా ఉంటాయి. దీంతో.. ఒక అంశాన్ని చదువుతున్నప్పుడు దానిని నిజ జీవిత సంఘటనలతో పోల్చి.. విజువలైజేషన్‌ చేయడం ఉపయుక్తంగా ఉంటుంది. అదే విధంగా..ఆయా విభాగాల్లో తాజా సాంకేతికత గురించి తెలుసుకోవాలి. 

ముఖ్య సమాచారం

  •     దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
  •     ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: 2024, జూలై 4
  •     ఎఫ్‌ఏడీఈఈఈ పరీక్ష తేదీలు: 2024, జూలై 20, 21 
  •     పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://jnafauadmissions.com

Posts at Bank of Baroda : బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో పోస్టులు రెగ్యులర్‌ ప్రాతిపదికన వివిధ పోస్టుల్లో భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు..


కెరీర్‌ అవకాశాలు
స్కల్ప్‌చర్‌ (శిల్ప కళ)
ప్రాచీన కాలం నుంచే వెల్లివిరిస్తున్న ఫైన్‌ ఆర్ట్స్‌ విభాగం.. శిల్పకళ. ప్రస్తుతం బీఎఫ్‌ఏ స్కల్పచర్‌ కోర్సు పూర్తిచేసిన యువతకు ఉపాధి అవకాశాలకు అనుకూలమైన పరిస్థితి నెలకొంది. కోర్సుల అనంతరం కొంతమంది ఇంటి వద్దే శిల్పాలు రూపొందిస్తుంటే.. మరికొందరు ప్రత్యేకంగా హోం స్టూడియోలు నిర్వహిస్తున్నారు. వీరంతా వ్యాపార సంస్థలు,ప్రభుత్వ ఏజెన్సీలు, వ్యక్తులకు శిల్పాలను సరఫరా చేస్తున్నారు. చక్కటి పరిశీలనా నైపుణ్యం, భావోద్వేగాలు, ఆలోచనలకు రూపం ఇవ్వగలిగే నేర్పు ఉన్నవారికి ఈ కోర్సు చక్కగా సరిపోతుంది.

బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌ (ఇంటీరియర్‌ డిజైన్‌)
ఒక ఇంటిని లేదా ఆఫీస్‌ సముదాయాన్ని లేదా ఒక కట్టడాన్ని అంతర్గతంగా చూడముచ్చటగా, అందంగా తీర్చిదిద్దే నైపుణ్యమే.. ఇంటీరియర్‌ డిజైన్‌. ప్రస్తుతం నగరాల్లోని ప్రజలు ఇంటీరియర్‌ డిజైనింగ్‌పై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. దీంతో వీరికి డిమాండ్‌ పెరుగుతోంది. పలు అంచనాల ప్రకారం–దేశంలో లక్ష మందికిపైగా ఇంటీరియర్‌ డిజైనింగ్‌ నిపుణుల కొరత ఉన్నట్లు అంచనా. ఇంటీరియర్‌ డిజైనింగ్‌ కోర్సును పూర్తి చేసుకుంటే.. ఉజ్వల కెరీర్‌ ఖాయం అని చెప్పొచ్చు. ఫర్నిచర్‌ డిజైనింగ్, ఎగ్జిబిషన్‌ డిజైనర్, లైటింగ్‌ డిజైనర్, కిచెన్‌ డిజైనర్, ఆర్కిటెక్ట్, ఆర్కిటెక్చురల్‌ టెక్నాలజిస్టు, ప్రొడక్ట్‌ డిజైనర్, టెక్స్‌టైల్‌ డిజైనర్‌ కొలువుల్లో స్థిరపడవచ్చు.

IAS Officers in Telangana: 41మంది ఐఏఎస్‌ల బదిలీ.. బదిలీ అయిన అధికారుల ప్రస్తుత, కొత్త పోస్టింగ్‌లు ఇవీ..

అప్లయిడ్‌ ఆర్ట్‌
ఆర్ట్‌ డెరైక్టర్‌ కావాలనుకునేవారికి చక్కటి కోర్సు.. అప్లయిడ్‌ ఆర్ట్‌! డ్రాయింగ్, పెయింటింగ్, క్లే మోడలింగ్‌లో బేసిక్స్‌తోపాటు విజువల్‌ కమ్యూనికేషన్‌ అండ్‌ గ్రాఫిక్స్‌ అంశాలపై మెలకువలు నేర్పుతారు. గ్రాఫిక్‌ డిజైన్, అడ్వర్‌టైజింగ్, లోగో డిజైనింగ్‌ అంశాల్లో ప్రావీణ్యత సంపాదించడం ద్వారా.. సినిమా రంగంలో ఆర్ట్‌ డెరైక్టర్‌గా, సెట్‌ డిజైనర్‌గా, విజువలైజర్‌గా అవకాశాలు అందుకోవచ్చు. వస్త్ర పరిశ్రమ, ఆభరణాల డిజైనింగ్, కలినరీ ఆర్ట్, గేమ్‌ డిజైనర్, యాడ్‌ ఫిలిం ఏజన్సీలలో స్టోరీ బోర్డ్‌ ఆర్టిస్ట్‌గా, క్రియేటివ్‌ ఆర్ట్‌ డెరైక్టర్‌గా అవకాశాలు లభిస్తాయి.

పెయింటింగ్‌ (చిత్రకళ)
ప్రకృతి అందాలకు చూడచక్కని రూపం ఇచ్చే కళ.. పెయింటింగ్‌. పెయింటింగ్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ చేసిన వారు తమ సృజనాత్మకతను జోడించి అద్భుతమైన పెయింటింగ్స్‌ రూపొందించే నైపుణ్యం పొందుతారు. పెయింటింగ్‌కు ప్రస్తుతమున్న డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుంటే.. ఇది యువతకు మంచి కెరీర్‌ మార్గంగా నిలుస్తోంది. పెయింటింగ్‌లో ఆయిల్‌ పెయింట్, వాటర్‌ కలర్‌ పెయింట్, ఆక్రిలిక్‌ పెయింట్, టెంపెరా పెయింట్‌ వంటి రకాలు ప్రాచుర్యం పొందుతున్నాయి. ఈ కోర్సు పూర్తిచేసిన వారికి ఫ్రీలాన్స్‌ ఆర్టిస్ట్, సెట్‌ డిజైనర్, కేంద్రీయ విద్యాలయం, నవోదయ, సైనిక్‌ స్కూల్‌ తదితర ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాల్లో చక్కటి అవకాశాలు లభిస్తాయి.

Long Term NEET Coaching : ఎస్టీ గురుకుల్లాల్లో ఉచిత లాంగ్‌ టర్మ్‌ నీట్‌ కోచింగ్‌

యానిమేషన్‌
ప్రస్తుతం యానిమేషన్‌ రంగం వేగంగా విస్తరిస్తున్న సంగతి తెలిసిందే. ప్రజలు వినో­దం కోసం తమకు అందుబాటులోనే ఉండే స్మార్ట్‌ ఫోన్, కంప్యూటర్‌ తదితర సాధనాలతోనే యానిమేషన్, గేమింగ్‌ వంటి వాటిపై ఆసక్తి పెంచుకుంటున్నారు. కాబట్టి యానిమేషన్‌ కోర్సులు పూర్తిచేసిన వారికి కెరీర్‌ అవకాశాలకు కొదవుండదని చెప్పొచ్చు. యా­నిమేషన్‌కు సంబంధించి సినిమాలు, టెలివిజన్, అడ్వర్‌టైజింగ్‌ విభాగాలు ప్రధాన ఉపాధి వేదికలు.

ఫొటోగ్రఫీ
ఫొటోగ్రఫీ కోర్సు పూర్తి చేసిన వారు ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాల్లో ఉజ్వల అవకాశాలు అందుకునే వీలుంది. కోర్సు అభ్యసించే సమయంలో ఫొటోగ్రఫీలో మెళకువలతో పాటు డిజిటల్‌ ల్యాబ్‌లు, గ్రీన్‌ మ్యాట్‌ స్టూడియోలను ఏర్పాటు చేస్తారు. ఫ్యాషన్‌ ఫొటోగ్రఫీ, ఆటోమొబైల్‌ ఫొటోగ్రఫీ, కార్పొరేట్‌ ఫొటోగ్రఫీ, వైల్డ్‌లైఫ్‌ ఫొటోగ్రఫీ విభాగాల్లో చక్కటి అవకాశాలు లభిస్తాయి.

ఉన్నత విద్య
బ్యాచిలర్‌ స్థాయి ఫైన్‌ ఆర్ట్స్‌ కోర్సులతోనే ఉజ్వలమైన ఉపాధి అవకాశాలు సొంతం చే­సుకోవచ్చు. అలాగే ఉన్నత విద్యపై ఆసక్తి ఉంటే పీజీలోనూ చేరవచ్చు. ఉన్నత విద్య ద్వారా సంబంధిత విభాగాల్లో స్పెషలైజేషన్‌ కోర్సు­ల్లో చేరేందుకు వీలవుతుంది. ఉద్యోగంతోపాటు స్వయం ఉపాధి మార్గాలు ఎంచుకోవచ్చు. సాఫ్ట్‌వేర్,మల్టీనేషనల్‌ కంపెనీల్లో సై­తం అవకాశాలు లభిస్తున్నాయి. ఆర్ట్‌ స్టూడియోలు, అడ్వర్‌టైజింగ్‌ కంపెనీలు, గ్రాఫిక్, ప్రింటింగ్, పబ్లిషింగ్, ఫ్యాషన్‌ సంస్థలు, ఎలక్ట్రానిక్స్, టెక్స్‌టైల్‌ పరిశ్రమలు, ఫిల్మ్‌ అండ్‌ థియేటర్, మల్టీ మీడియా, యానిమేషన్‌ తదితర సంస్థల్లో కొలువులు సొంతం చేసుకోవచ్చు.  

Free Civils Coaching : టీఎస్‌ బీసీ స్టడీ సర్కిల్‌లో ఉచిత సివిల్స్ లాంగ్ ట‌ర్మ్ కోచింగ్‌కు ద‌ర‌ఖాస్తులు..

#Tags