Fastest Growing Jobs: డిగ్రీ లేకపోయినా సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా ఉద్యోగం.. లింక్డ్‌ఇన్‌ నివేదిక

డిజైన్, అనలిటిక్స్, ప్రోగ్రామింగ్ నైపుణ్యాలున్న ఫ్రెషర్లకు అధిక ఉద్యోగావకాశాలున్నట్లు లింక్డ్‌ఇన్ కెరీర్ స్టార్టర్ 2024 నివేదిక వెల్లడించింది.  నివేదికలోని వివరాల ప్రకారం..2024లో కంపెనీలు పనిప్రదేశాల్లో సౌకర్యవంతమైన ఏర్పాట్లు చేస్తున్నాయి. ఆఫీస్‌ నుంచి పనిచేసే ఉద్యోగాలు 15% తగ్గాయి.

ఎంట్రీలెవల్‌ ఉద్యోగాల కోసం కంపెనీలు హైబ్రిడ్ వర్క్‌కల్చర్‌ను 52% పెంచాయి. దాంతో ఫ్రెష్‌ గ్రాడ్యుయేట్లు పనిచేసేందుకు వీలుగా కంపెనీలు మార్పులు చేస్తున్నాయి. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న యుటిలిటీస్‌ విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసినవారికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 

డిగ్రీ లేకపోయినా ఉద్యోగ అవకాశాలు..
చమురు, గ్యాస్, మైనింగ్, రియల్ ఎస్టేట్, కస్టమర్‌ సర్వీస్‌ రంగాల్లో ఫెషర్లను ఎక్కువగా నియమించుకుంటున్నారు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ , సిస్టమ్ ఇంజినీర్, ప్రోగ్రామింగ్ అనలిస్ట్ వంటి ఉద్యోగాల్లో ఫ్రెషర్లను ఎంపికచేస్తున్నారు. కమ్యూనిటీ, సోషల్ సర్వీసెస్, లీగల్, మార్కెటింగ్, కమ్యూనికేషన్ వంటి రంగాల్లో బ్యాచిలర్ డిగ్రీ అభ్యర్థులకు అవకాశాలు ఉన్నాయి.

SSC CHSL 2024 Notification: ఇంటర్ అర్హతతో 3,712 ఉద్యోగాలు.. ఎంపిక ప్రక్రియ, పరీక్ష విధానం, ప్రిపరేషన్‌ గైడెన్స్‌..

డిగ్రీ పూర్తిచేయని వారికి విద్య, సాంకేతికత, సమాచారం, మీడియా, మానవ వనరులు, మార్కెటింగ్, కమ్యూనికేషన్‌ రంగంలో ఉద్యోగావకాశాలు ఉన్నాయి. డిగ్రీలేనివారు సైతం సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, సెక్రటరీ, డిజైన్ ఇంజినీర్ వంటి ఉద్యోగాల్లో తమ కెరియర్‌ ప్రారంభించవచ్చు.

లింక్డ్‌ఇన్ కెరీర్‌ ఎక్స్‌పర్ట్‌ అండ్‌ ఇండియా సీనియర్ మేనేజింగ్ ఎడిటర్ నిరజితా బెనర్జీ మాట్లాడుతూ..‘కంపనీల్లో ఏఐ వాడకం పెరుగుతోంది. దాంతో కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తున్నాయి. విభిన్న విద్యా నేపథ్యాలు కలిగిన నిపుణులను ఎంచుకునేందుకు కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఉద్యోగంకోసం చూస్తున్నవారు నిత్యం తమ నైపుణ్యాలను పెంచుకోవాలి’ అని చెప్పారు.

#Tags