Jobs In Medical College: నిరుద్యోగ తీవ్రత.. పోస్టులు 155, కానీ దరఖాస్తులు 5వేలకు పైగానే..
సూపర్‌బజార్(కొత్తగూడెం): కొత్తగూడెంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలోని 23 విభాగాల్లో 155 ఔట్ సోర్సింగ్ పోస్టుల భర్తీకి జిల్లా ఉపాధికల్పన శాఖ ఆధ్వర్యంలో ఈనెల 20 నుంచి మంగళవారం వరకు దరఖాస్తులు స్వీకరించారు. ఈనేపథ్యాన 5,200 మంది దరఖాస్తు చేసుకోగా చివరి రోజైన మంగళవారం కలెక్టరేట్‌కు వచ్చిన వారిని చూస్తే నిరుద్యోగ సమస్య తీవ్రత బయటపడింది.
SCCL Recruitment 2024: సింగరేణిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. 134 ఏళ్లలో ఇలా తొలిసారి..
అభ్యర్థులతో దరఖాస్తు స్వీకరణ హాల్ కిక్కిరిసిపోయింది. ఇక దరఖాస్తులకు జతచేసే సర్టిఫికెట్ జిరాక్స్ కాపీలపై గెజిటెడ్ అధికారి సంతకం చేయించాలనే నిబంధనతో పలువురు ఇబ్బందులకు గురయ్యారు.
సంతకం చేయాలంటే ఒరిజినల్ సర్టిఫికెట్లు చూపించాలని గెజిటెడ్ అధికారులు చెప్పడంతో అవి అందుబాటులో లేక తిప్పలుపడ్డారు. ఒకరు ఒక పోస్టుకు మాత్రమే దరఖాస్తు చేయాలని అధికారులు సూచించడంతో తొలుత అభ్యర్థులు నిరసన వ్యక్తం చేసినా.. చివరకు అలాగే సమర్పించారు.