Dussehra Holidays Changes Dates 2023 : ఇచ్చిన దసరా పండ‌గ‌ సెలవుల‌ తేదీల్లో మార్పులు.. ఎందుకంటే..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ‌లో అత్యంత వైభవంగా జ‌రుపుకునే పండ‌గ‌ల్లో దసరా పండ‌గ మొద‌టి స్థానంలో ఉంటుంది. ఇప్ప‌టికే తెలంగాణ ప్ర‌భుత్వం స్కూల్స్‌,కాలేజీల్లో సెల‌వులు ఇచ్చిన విష‌యం తెల్సిందే. కానీ తెలంగాణ ప్రభుత్వం దసరా సెలవు తేదీలో మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దసరా సెలవును అక్టోబరు 23కి మారుస్తూ నిర్ణయం తీసుకుంది.
Dussehra Holidays Changes Dates 2023

అంతేకాకుండా అక్టోబరు 24వ తేదీని కూడా సెలవుదినంగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో ప్రభుత్వం విజయ దశమి సెలవును మార్చింది. ఇంతకు ముందు ప్రకటించిన సెలవును సైతం కొనసాగింది. ఈ ఏడాదికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన సెలవుల జాబితాలో అక్టోబరు 24వ తేదీన దసరా సెలవు దినంగా పేర్కొంది. తాజాగా ఆ సెలవును ఒక రోజు ముందుకు తీసుకొచ్చింది.

☛ Dasara, Christmas and Sankranti Holidays 2023 : గుడ్‌న్యూస్‌.. ఈ సారి దసరా, క్రిస్మస్, సంక్రాంతి సెలవులు ఇవే.. మొత్తం ఎన్ని రోజులంటే..?

స్కూల్‌ విద్యార్థులకు సెలవులతో పాటు, మిగతా వారికి అక్టోబర్ 23, 24 తేదీల్లో దసరా సెలవులు ఉంటాయని ప్రభుత్వం పేర్కొంది. బతుకమ్మ పండుగ ప్రారంభం రోజును అక్టోబర్ 14న సాధారణ సెలవు ఇవ్వగా.. దుర్గాష్టమి అక్టోబర్ 22న ఆప్షనల్‌ హాలిడేగా ఇచ్చింది. దసరా పండుగ నేపథ్యంలో పాఠశాలలకు దాదాపు 13 రోజులు పాటు సెలవులు ఇవ్వగా.. జూనియర్‌ కాలేజీలకు ఏడు రోజులు సెలవులు ఉండనున్నాయి. తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ప్రకారం.. జూనియర్ కాలేజీలకు అక్టోబర్ 19వ తేదీ నుంచి 25 వరకు సెలవులు ఉంటాయి. తిరిగి అక్టోబ‌ర్ 26వ తేదీన‌ కాలేజీలు పునఃప్రారంభంకానున్నాయి.

☛ Schools & Colleges Holidays October 2023 List : అక్టోబ‌ర్ నెల‌లో స్కూల్స్‌, కాలేజీల‌కు అత్యంత భారీగా సెల‌వులు.. మొత్తం ఎన్ని రోజులంటే..?

#Tags