Skip to main content

Schools and Colleges Holidays : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని స్కూల్స్‌కు రేప‌టి నుంచి సెల‌వులు.. అలాగే కాలేజీల‌కు కూడా మ‌ళ్లీ..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ స్కూల్స్‌, కాలేజీల‌కు ఎక్కువ రోజులు సెల‌వులు ద‌స‌రా పండ‌గకు ఇస్తారు. విద్యార్థుల‌కు ద‌స‌రా పండ‌గ వ‌స్తోందంటే.. వాళ్ల ఆనంద‌కు ఆవ‌ధులు ఉండ‌వ్‌. ఇక ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ద‌స‌రా సెల‌వులు రేప‌టి నుంచి ప్రారంభంకానున్నాయి.
Dussehra Holidays, Schools Holidays News Telugu Andhra Pradesh Dussehra Holiday Announcement
Schools Holidays News in Telugu

అక్టోబ‌ర్ 14వ తేదీ నుంచి అక్టోబ‌ర్ 24వ తేదీ వరకు ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ స్కూల్స్ విద్యాశాఖ‌ దసరా సెలవులు ప్రకటించింది. మొత్తం 10 రోజులు పాటు ద‌స‌రా సెల‌వులు స్కూల్స్ ఉండ‌నున్నాయి. ఈ దసరా సెలవుల అనంతరం అక్టోబ‌ర్ 25వ తేదీన‌ నుంచి తరగతులు ప్రారంభమవుతాయని తెలిపింది. ఈ మేరకు విద్యాశాఖ అధికారిక ఉత్తర్వులు ప్రకటించింది. అలాగే కాలేజీల‌కు కూడా 6 నుంచి 7 రోజులు పాటు ద‌స‌రా సెల‌వులు ఇచ్చే అవ‌కాశం ఉంది.

☛ Schools & Colleges Holidays October 2023 List : అక్టోబ‌ర్ నెల‌లో స్కూల్స్‌, కాలేజీల‌కు అత్యంత భారీగా సెల‌వులు.. మొత్తం ఎన్ని రోజులంటే..?

తెలంగాణ‌లో ధూంధాంగా.. 13 రోజులు పాటు..

colleges holidays news telugu

తెలంగాణ‌లో స్కూల్స్‌కు.. దసరా, బతుకమ్మ వేడుకల సందర్భంగా 13 రోజుల సెలవులను ప్రకటించిన విషయం తెలిసిందే. అక్టోబర్ 13వ తేదీ నుంచి 25వ తేదీ వరకు స్కూల్స్ సెలవులు ఇవ్వడంతో పాటు ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి మిగితా పండగల సెలవులను కూడా ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా దసరా తర్వాత వచ్చే దీపావళి పండగకు ఒక్క రోజు మాత్రమే సెలవు ఇచ్చింది.ఈసారి తెలంగాణ‌తో పోలిస్తే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో దసరా సెల‌వులు త‌క్కువ‌గానే ఉన్నాయి.

☛ Income Certificate : ఇక‌పై ఈజీగానే.. ఇన్‌కమ్ సర్టిఫికెట్ తీసుకోండిలా.. ప్రవేశాలు, స్కాలర్‌షిప్‌లు, ప్రభుత్వ ఉద్యోగాల‌కు మాత్రం..

☛ Tenth and Inter Public Exams : ఇక‌పై.. ఏడాదికి రెండు సార్లు టెన్త్‌, ఇంటర్‌ బోర్డు పరీక్షలు.. కొత్త‌ రూల్స్ ఇవే..

ఇక జనవరి 9, 2024 నుంచి 18, 2024 వరకు సంక్రాంతి సెలవులు.. డిసెంబ‌ర్ 17వ తేదీ నుంచి 26వ తేదీ వ‌ర‌కు క్రిస్ట‌మ‌స్ సెల‌వులు (మిష‌న‌రీ స్కూల్స్‌కు మాత్ర‌మే ఉంటాయి). ఇంకా దీపావ‌ళి, ఉగాది, రంజాన్ తదితర పండ‌గ‌ల‌కు ఆ రోజును బ‌ట్టి సెల‌వులు ఇవ్వ‌నున్నారు. డిసెంబర్ నెలలో వచ్చే క్రిస్మస్ సెలవులను ఐదు రోజులు ఇచ్చింది. డిసెంబర్ 22 నుంచి 26 వరకు ఐదు రోజులపాటు మిషనరీ స్కూళ్లకు క్రిస్మస్ సెలవులు ఉంటాయని, ఇతర స్కూళ్లకు మాత్రం ఒక్క రోజు సెలవు ఉంటుందని పేర్కొంది. ఈ విద్యా సంవత్సరంలో వచ్చే మరో పెద్ద పండగ సంక్రాంతికి ఆరు రోజుల సెలవులను ప్రకటించింది ప్రభుత్వం. బోగి, సంక్రాంతి, కనుమ పండగలతో కలిపి 6 రోజులు సెలవులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

కాలేజీల‌కు ద‌స‌రా సెల‌వులు ఇలా..

colleges holidays 2023 telugu news

తెలంగాణ‌లోని అన్ని ప్ర‌భుత్వ‌, ప్రైవేట్‌ ఇంటర్ కాలేజీలకు అక్టోబర్ 19వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఇంట‌ర్ బోర్డ్ సెల‌వుల‌ను ప్ర‌క‌టించింది. మొత్తం ఆరు రోజులు పాటు ఇంట‌ర్ కాలేజీల‌కు సెల‌వుల‌ను ఇచ్చారు. ప్రైవేట్‌, ఎయిడెడ్‌ ప్రభుత్వ కాలేజీలన్నింటికీ ఈ సెలవులు వర్తిస్తాయని ఇంటర్‌ బోర్డు స్పష్టం చేసింది. అలాగే గ‌తంలో 2022లో ఎనిమిది రోజుల పాటు దసరా సెలవులు ఇచ్చిన విష‌యం తెల్సిందే.

Income, Caste Certificate New Guidelines : విద్యార్థుల‌కు గుడ్‌న్యూస్‌.. ఇకపై ఇన్‌క‌మ్‌, క్యాస్ట్ సర్టిఫికెట్ ఒకసారి తీసుకుంటే..

Published date : 14 Oct 2023 09:17AM

Photo Stories