Gudem Mahipal Reddy: జూనియర్ కాలేజీలు ఇవ్వండి
Sakshi Education
ఆశీర్వాద సభలో గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్‌కు ఈ ప్రాంత సమస్యలను వివరిస్తూ వాటిని పరిష్కరించాలని కోరినట్లు తెలిపారు.
పటాన్‌చెరు నియోజకవర్గంలో 2 లక్షల 50 వేలకు పైగా ఉన్న కార్మికుల కోసం 75 గజాల స్థలాన్ని కేటాయించాలన్నారు. గుమ్మడిదల మండల కేంద్రంలో జూనియర్ కళాశాల ఏర్పాటు, రైతుల కోసం వ్యవ సాయ గోదాము నిర్మాణం, మినీ స్టేడియం అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలన్నారు.
అమీన్‌పూర్ మండలంలోని, మున్సిపాలిటీ ప్రజల కోసం జూనియర్ కళాశాల ఏర్పాటు, తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో జూనియర్ కళాశాల, మినీ స్టేడియం, మార్కెట్ యార్డు కోసం స్థలం, నిధులు ఇవ్వాలని కోరామన్నారు.
Published date : 25 Nov 2023 11:53AM