Gurukul School Inspection : గురుకుల పాఠశాలలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ.. ఉపాధ్యాయులకు సూచనలు ఇలా!
రేణిగుంట: కొత్తగా బాధ్యతలు చేపట్టిన కలెక్టర్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్ శుక్రవారం జిల్లాలు సుడిగాలి పర్యటన చేశారు. మొదల ఆయన తిరుపతిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పారిశుద్ధ్య చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఆ తర్వాత రేణిగుంట ఎయిర్‌పోర్టు సమీపంలో ఉన్న గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని, ప్రభుత్వం నుంచి అందిన యూనిఫారం, షూ, బ్యాగ్, పుస్తకాలు సంబంధిత విద్యార్థులకు సత్వరమే పంపిణీ చేసి వాటిని వినియోగించేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు.
విద్యార్థుల నమోదు శాతం వందశాతం ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపాల్‌ను ఆదేశించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుని విద్యార్థుల విద్య, ఆరోగ్యం పట్ల అధికారులు శ్రద్ధ వహించాలని సూచించారు. పాఠశాలలో మొత్తం 480మంది విద్యార్థులకు గాను 430 మంది ఉన్నట్లు ప్రిన్సిపల్ హరిబాబు వివరించారు. దీంతో కలెక్టర్ అటెండెనన్స్ రిజిస్టర్ పరిశీలించి గైర్హాజరైన విద్యార్థులను తిరిగి పాఠశాలకు తీసుకొచ్చేలా, మిగిలి ఉన్న సీట్లు కూడా భర్తీ అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. వార్డెన్ లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేయగా వారు సెలవులో ఉన్నారని వివరించారు.
Beauty Therapy Training: బ్యూటీ థెరపీలో శిక్షణ
సౌకర్యాలపై ఆరాతీస్తూ..ఆప్యాయత పంచుతూ..
విద్యార్థులతో కలెక్టర్ ఆప్యాయంగా మాట్లాడుతూ ఉదయం ఏమి టిఫిన్ చేశారని ఆరా తీయగా పొంగల్ చట్నీ పెట్టారని తెలిపారు. ఎలా చదువు చెప్తున్నారు, ఆహారం బాగుందా..? పుస్తకాలు, యూనిఫాం ఇచ్చారా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. తరగతి గదిలో విద్యార్థులతో కలసి డెస్క్‌లో కూర్చుని హిందీ ఉపాధ్యాయురాలు టీచింగ్ స్కిల్స్ పరిశీలించారు. గురుకుల పాఠశాల నుంచి జిల్లా గిరిజన సంక్షేమ అధికారి సూర్యనారాయణతో ఫోన్‌లో మాట్లాడి గైర్హాజరైన విద్యార్థులను తిరిగి పాఠశాలకు తెచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం హాస్టల్‌లోని భోజనశాలలో అన్నం, పప్పు, స్టాక్ వివరాలను పరిశీలించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి అని సూచించారు. ప్రతి శుక్రవారం డ్రైడే పాటించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.