Anganwadi on Duty: అంగ‌న్వాడీల‌ను స‌త్వ‌ర‌మే విధుల్లోకి తీసుకోవాలి..

సార్వత్రిక ఎన్నికలలో ఎన్నికల నిబంధన నియమావళి ఉల్లంఘించారనే నెపంతో అంగన్‌వాడీలను తొలగించారన్నారు.

నరసరావుపేట: ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారన్న నెపంతో విధుల నుంచి తొలగించిన అంగన్‌వాడీలను సత్వరమే తిరిగి విధుల్లోకి తీసుకోవాలని సీఐటీయూ పల్నాడు జిల్లా కమిటీ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు కమిటీ నాయకులు గురువారం జిల్లా కలెక్టర్‌ శ్రీకేశ్‌ బి.లత్కర్‌ కలిసి విన్నవించారు. ఆ సమయంలో తాను ఇక్కడ విధుల్లో లేని నేపథ్యంలో నరసరావుపేట ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులకు విన్నవించాలన్న జిల్లా కలెక్టర్‌ సూచన మేరకు ఆర్డీఓ కార్యాలయంలో ఏఓ కె.శివరామకృష్ణారావుకు వినతిపత్రం అందజేశారు.

Environment Protection: ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌కు చేస్తున్న కృషికి ఐక్య రాజ్య స‌మితి ప్ర‌శంస‌లు..

జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌.ఆంజనేయ నాయక్‌ మాట్లాడుతూ ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఎన్నికల నిబంధన నియమావళి ఉల్లంఘించారనే నెపంతో అంగన్‌వాడీలను తొలగించారన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వివిధ రాజకీయ పార్టీలు అంగన్‌వాడీ ఉద్యోగుల ఇళ్లకు వచ్చి ఓట్లు అభ్యర్థిస్తున్న సందర్భంగా తీసిన ఫొటోలను ఉపయోగించి రాజకీయ కక్షతో కొంతమంది అంగన్‌వాడీ ఉద్యోగులపై ఫిర్యాదులు చేశారని, ఆ తప్పుడు ఫిర్యాదులను ఆధారంగా చేసుకొని చిరు ఉద్యోగులను తొలగించడం అన్యాయమన్నారు.

SCCL Recruitment Board: బీటెక్‌ ఫైనలియర్‌ విద్యారులూ అర్హులే..

ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షురాలు గుంటూరు మల్లీశ్వరి మాట్లాడుతూ మాతా, శిశు సంరక్షణలో అంగన్‌వాడీల పాత్ర కీలకమన్నారు. ప్రభుత్వం మానవతా దృక్పథంతో స్పందించి తొలగించిన అంగన్‌వాడీలను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే యూనియన్‌ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని హెచ్చరించారు. నరసరావుపేట ప్రాజెక్టు కార్యదర్శి నిర్మల, సాయి పాల్గొన్నారు.

Pakistan Budget: రక్షణ రంగానికి బడ్జెట్‌ను పెంచిన పాకిస్థాన్‌..!

#Tags