Andhra University: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు 25 వరకు గడువు

ఏయూక్యాంపస్‌: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో సెల్ఫ్‌ సపోర్ట్‌ విభాగంలో ప్రవేశాల దరఖాస్తు గడువు జులై 25తో ముగియనుందని సంచాలకుడు ఆచార్య డి.ఎ.నాయుడు తెలిపారు. ఏపీఐసెట్‌లో అర్హత సాధించి.. డిగ్రీలో కనీసం 50 శాతం మార్కులు, 45 శాతం మార్కులు సాధించిన రిజర్వేషన్‌ అభ్యర్థులు ఎంబీఏ కోర్సులో ప్రవేశానికి అర్హులు. ఏపీ ఐసెట్‌లో అర్హత సాధించి బీసీఏ, డిగ్రీలో కంప్యూటర్‌ సైన్స్‌ చదివిన వారు ఎంసీఏ కోర్సుకు అర్హులు. డిగ్రీలో 50 శాతం మార్కులు, రిజర్వేషన్‌ కలిగిన విభాగాల వారు 45 శాతం మార్కులు సాధించి ఉండాలి. ఏయూ కామర్స్‌ మేనేజ్‌మెంట్‌ విభాగంలో నిర్వహించే ఎంబీఏ మార్కెటింగ్‌ మేనేజ్‌మెంట్‌, ఎంబీఏ ఫైనాన్స్‌ మేనేజ్‌మెంట్‌, ఎంబీఏ హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో 44 సీట్లు చొప్పున భర్తీ చేస్తారు. ఏయూ స్కూల్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ బిజినెస్‌లో 44 సీట్లు భర్తీ చేస్తారు. ఇంజినీరింగ్‌ కళాశాలలో నిర్వహించే ఎంసీఏ(ఫుల్‌టైం) కోర్సులో 50 సీట్లు భర్తీ చేస్తారు. ఎంబీఏ కోర్సుకు ఏడాదికి రూ 1.5 లక్షలు, ఎంసీఏకు ఏడాదికి రూ.1.25 లక్షల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అర్హత కలిగిన వారు ప్రవేశాల సంచాలకుల వెబ్‌సైట్‌ నుంచి దరఖాస్తును డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. పూర్తి చేసిన దరఖాస్తులను పెదవాల్తేరులోని ప్రవేశాల సంచాలకుల కార్యాలయంలో అందజేయాలి. జులై 27న ప్రవేశాల కౌన్సెలింగ్‌ ఉంటుంది. పూర్తి వివరాలకు www. audoa.inను సందర్శించవచ్చు.

MFA Admission in JNAFAU University: జేఎన్‌ఏఎఫ్‌ఏ యూనివర్శిటీలో ఎంఎఫ్‌ఏ ప్రవేశాలు.. కోర్సులు, సీట్లు వివరాలు..

#Tags