STEM programme: విద్యార్థులకు స్పేస్ బయాలజీ, సెల్ బయాలజీ, ఏఐలపై మూడు వారాలపాటు ఉచిత తరగతులు.. పూర్తి వివరాలకు చదవండి.
మూడు వారాల పాటు ఉచితంగా కోర్సును అందించనున్నారు. ఇందుకోసం We Speak Science వెబ్‌సైట్‌లోకి వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
చదవండి: అగ్నివీర్ రిక్రూట్‌మెంట్‌కు ఇలా అప్లై చేసుకోండి
300 మందికి అవకాశం
స్టెమ్ ప్రోగ్రాం ద్వారా భారతీయ విద్యార్థులకు ఆర్టిఫీసియల్ ఇంటెలిజెన్స్, స్పేస్ బయాలజీ, సెల్ బయాలజీ లపై We Speak Science అవగాహన కల్పించనుంది. దేశంలోని విద్యార్థులు ఎవరైనా దీని కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అయితే 300 మందికి మాత్రమే మూడు వారాల పాటు ఉచిత శిక్షణ అందించనుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియను సదరు సంస్థ ప్రారంభించింది. ఫిబ్రవరి 27వ తేదీ నుంచి క్లాసులు ప్రారంభమవుతాయి.
మూడు వారాల పాటు క్లాసులు
మూడు వారాల పాటు ఏఐ, స్పేస్ బయాలజీ, సెల్ బయాలజీపై ప్రాథమిక స్థాయిలో తరగతులు ఉంటాయి. వీటిని ఆక్స్‌ఫొర్డ్ యూనివర్సిలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కోర్సు డైరెక్టర్ అజిత్ జావోకర్, నాసాలో వ్యోమగామిగా శిక్షణ పొందిన ప్రొఫెసర్ వ్లాదిమిర్ ప్లెట్సర్, We Speak Science వ్యవస్థాపకురాలు డాక్టర్ డెటినా జల్లి బోధిస్తారు. వివరాలకు https://wespeakscience.com/ ను సందర్శించండి.