Skip to main content

Agnipath Scheme: ఆర్మీలో భారీగా ఉద్యోగాలు.. అగ్నివీర్ రిక్రూట్‌మెంట్‌కు ఇలా అప్లై చేసుకోండి

ఇండియన్‌ ఆర్మీలో చేరాలనుకుంటున్న యువతకు శుభ‌వార్త‌. అగ్నివీరుల నియామకానికి ప్రకటన విడుదలైంది. అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి ఆర్మీ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 17 నుంచి దరఖాస్తు చేసుకునేందుకు వీలు కల్పించింది.
Agnipath Rally

మార్చి 15ను ఆఖరి తేదీగా నిర్ణయించింది. అక్టోబ‌ర్ 1, 2002 నుంచి ఏప్రిల్1, 2006 మ‌ధ్య జ‌న్మించిన వారు ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు అర్హులు. అర్హులైన వారు https://www.joinindianarmy.nic.in/Authentication.aspx వెబ్‌ సైట్లో దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. ఏప్రిల్‌ 17 నుంచి ఆన్‌లైన్‌ లో కంప్యూటర్‌ బేస్డ్‌ ఎగ్జామ్‌ నిర్వహించనున్నారు. ఈ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు మాత్ర‌మే శారీరక సామర్థ్య పరీక్షలు నిర్వహిస్తారు. అన్ని దశల్లో అర్హత సాధించిన వారిని నాలుగేళ్ల కాలానికి అగ్నివీరులుగా ఎంపిక చేస్తారు.

విశాఖ రేంజ్ ప‌రిధిలో ఉన్న వారికి మాత్ర‌మే...
విశాఖపట్నంలోని ఆర్మీ రిక్రూటింగ్ నియామకాలకు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, అనకాపల్లి, ఏలూరు, ఎన్టీఆర్, కాకినాడ, యానాం (యూటీ పుదుచ్చేరి) జిల్లాలకు చెందిన అభ్యర్థులు మాత్ర‌మే అర్హులు.
పోస్ట్‌ల‌ వివరాలు..
1) అగ్నివీర్‌ జనరల్‌ డ్యూటీ
అర్హత: అభ్యర్థులు కనీసం 45 శాతం మార్కులతో టెన్త్‌ పాసై ఉండాలి. ఒక్కో సబ్జెక్టులో కనీసం 33 శాతం మార్కులు సాధించి ఉండాలి. లైట్‌ మోటార్‌ వెహికిల్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ కలిగి ఉండాలి. ఎత్తు 166 సెం.మీ ఉండాలి. అన్ని పోస్టుల‌కు అభ్యర్థుల వయసు 17.5 నుంచి 21 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.

2) అగ్నివీర్‌ టెక్నికల్‌
అభ్యర్థులు 50 శాతం మార్కులతో ఇంటర్‌ లేదా అందుకు సమానమైన విద్యార్హత పొంది ఉండాలి. ఒక్కో సబ్జెక్టులో కనీసం 40 శాతం మార్కులు సాధించి ఉండాలి. టెన్త్‌తో పాటు రెండేళ్ల ఐటీఐ/ మూడేళ్ల డిప్లొమా చేసి ఉండాలి. ఎత్తు 165 సెం.మీ ఉండాలి.

చ‌ద‌వండి: TSSPDCL Jobs : 1,661 పోస్టులు.. సిల‌బ‌స్‌.. పరీక్షావిధానం ఇదే..

3) అగ్నివీర్‌ క్లర్క్‌/స్టోర్‌ కీపర్‌ (టెక్నికల్‌)
అభ్యర్థులు 60 శాతం మార్కులతో ఇంటర్‌ లేదా అందుకు సమానమైన విద్యార్హత కలిగి ఉండాలి. ఒక్కో సబ్జెక్టులో కనీసం 50 శాతం మార్కులు సాధించి ఉండాలి.  ఎత్తు 162 సెం.మీ ఉండాలి.

4) అగ్నివీర్‌ ట్రేడ్స్‌మ్యాన్‌(10వ త‌ర‌గ‌తి)
అభ్యర్థులు టెన్త్ పాసై ఉండాలి. ఒక్కో సబ్జెక్టులో కనీసం 33 శాతం మార్కులు సాధించి ఉండాలి. ఎత్తు 166 సెం.మీ ఉండాలి.

చ‌ద‌వండి: తెలంగాణ గ్రూప్ 2 ప‌రీక్ష‌ల‌కు భారీగా ద‌ర‌ఖాస్తులు.. పూర్తి వివ‌రాలు ఇవే

5) అగ్నివీర్‌ ట్రేడ్స్‌మ్యాన్‌(8వ త‌ర‌గ‌తి)
అభ్యర్థులు 8వ తరగతి పాసై ఉండాలి. ఒక్కో సబ్జెక్టులో కనీసం 33 శాతం మార్కులు సాధించి ఉండాలి.  ఎత్తు 166 సెం.మీ ఉండాలి.
ఫీజు: రూ.250 చెల్లించి ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తుచేసుకోవాలి.
వివ‌రాల‌కు https://www.joinindianarmy.nic.in/Authentication.aspx వెబ్‌సైట్‌ను సంద‌ర్శించండి.

Published date : 17 Feb 2023 06:56PM

Photo Stories