Mega Job Mela: రేపు మెగా జాబ్ మేళా.. రూ.45 వేల వరకు వేతనం..
ఆర్‌ఎస్ టెక్నాలజీస్, హెటిరో డ్రగ్స్, ఎంఏఎస్ మైరెన్ సర్వీసెస్, ఇ–జోస్ సెక్యూరిటీ, డెక్కన్ ఫైన్ కెమికల్స్, ల్యాండ్ మార్క్ గ్రూప్, ఫ్లిప్‌కార్డ్, రిల యన్స్ ట్రెండ్స్, పేటీఎం, ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ ప్రైవేట్ లిమిటెడ్ తదితర కంపెనీల్లో 1,936 ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు ఏర్పాటు చేశారు.
సాఫ్ట్‌వేర్ డెవలపర్, జూనియర్ కెమిస్ట్, పోర్ట్ సర్వేయర్, ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్, రిటైల్ ట్రైనింగ్ అసోసియేట్, ఫార్మాసిస్ట్, జూనియర్ ట్రైనీ, డెవలప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్స్, ఆఫీస్ అసిస్టెంట్, అకౌంట్స్, టెలీకాలర్, అసిస్టెంట్, రిక వరీ క్లర్క్, బ్రాంచ్ ఇన్‌చార్జి, మా ర్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లమో, ఏదైనా డిగ్రీ, పీజీ చేసిన వారు అర్హులు. 18–35 సంవత్సరాల వయసు కలిగిన అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరుకావచ్చు. ఆయా ఉద్యోగాలను బట్టి జీతం నెలకు రూ.15,000 నుంచి రూ.45,000 వరకు ఉంటుందన్నారు. ఉదయం 10 గంటలకు జాబ్‌మేళా ప్రారంభమవుతుందని తెలిపారు.