Skip to main content

Job Mela: రేపు జాబ్‌ మేళా.. ఉద్యోగం వ‌స్తే జీతం ఎంత ఉంటుందంటే..

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసీ), మాస్టర్‌మైండ్‌ డిగ్రీ కళాశాల (అనంతపురం) సంయుక్త ఆధ్వర్యంలో డిసెంబ‌ర్‌ 28న ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్య అధికారి ఎల్‌.ఆనంద్‌ రాజ్‌కుమార్‌ తెలిపారు.
APSSDC Employment Drive  APSSDC Job FairCareer Opportunities in Andhra Pradesh  Job Mela  APSSDC Job Fair December 28  Ananthapuram Employment Event

హెటిరోక్లబ్‌, ఫ్లిప్‌కార్ట్‌, ఎస్‌ఐఎస్‌ ఇండియా, కాలిబెర్‌, అపోలో ఫార్మసీస్‌, ఆస్ట్రోస్టీల్స్‌, రిలయన్స్‌ నిప్పో లైఫ్‌ ఇన్సూరెన్స్‌, పవర్‌ గ్రూప్‌ సర్వీసెస్‌, నవభారత్‌ ఫర్టిలైజర్స్‌, శ్రీజ మిల్క్‌ కంపెనీలు ఇంటర్వ్యూలు నిర్వహిస్తాయన్నారు. ఉద్యోగానికి ఎంపికైన వారికి నెలకు రూ.10 వేల నుంచి రూ.20 వేల దాకా జీతాలు ఉంటాయని తెలిపారు.
అనంతపురం, బెంగళూరు, హైదరాబాద్‌, హిందూపురంలో ఉద్యోగం చేయాల్సి ఉంటుందన్నారు. ఆసక్తి గల వారు బయోడేటాతో పాటు ఆధార్‌, విదార్హత పత్రాలు తీసుకుని ఉదయం 9 గంటలకు అనంతపురంలోని మాస్ట్‌ర్‌మైండ్‌ డిగ్రీ కళాశాలలో ఉద్యోగ మేళాకు హాజరు కావాలన్నారు. ఇంటర్వ్యూకు హాజరయ్యే వారు www.apssdc.in లింక్‌లో రిజిస్టర్‌ చేసుకోవాలని, పూర్తి వివరాలకు 83175 20929, 70754 68111 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

 

Published date : 27 Dec 2023 02:57PM

Photo Stories