AP MSME Parkలతో మారుమూల గ్రామాల్లోని యువకులకు ఉద్యోగ అవకాశాలు
మండలంలోని కణమాంలో ఏపీఐఐసీకి భూములు అందించిన వంద మంది రైతులకు బుధవారం రూ.28 కోట్ల పరిహార చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుమూల గ్రామాల్లోని యువకులకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపరచడానికి కార్యాచరణ రూపొందిస్తున్నామని వివరించారు. ఇటీవలే జగన్నాథపురంలో గ్రేహౌండ్స్ నిమిత్తం భూములు అందించిన రైతులకు రూ.15 కోట్లు చెల్లించామని తెలిపారు.
AP Paramedical posts: ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో పారామెడికల్ పోస్టులు
కణమాంలో ఏపీఐఐసీ సేకరించిన 157 ఎకరాల్లో ఆటోనగర్ ఏర్పాటుతోపాటు, ఎంఎస్‌ఎంఈ పార్కు కూడా ఏర్పాటు చేయనున్నామని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి తొందరలోనే ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. దీనివల్ల ఆనందపురం మండలంలో వందలాది మంది యువతకు ఉపాధి లభిస్తుందని, ముఖ్యంగా ఐటీఐ, పాలిటెక్నిక్ చదివిన వారికి ఉపాధి మెరుగవుతుందన్నారు.
IAS officer Chakrapani: విద్యార్థులు జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి