Skip to main content

Free training for youth: యువతకు ఉచిత శిక్షణ

Free training for youth, GMR Varalakshmi Foundation Initiative, Skill Development
Free training for youth

ఆసిఫాబాద్‌రూరల్‌: జీఎంఆర్‌ వరలక్ష్మి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో యువతకు ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి తెలిపారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు క్యాంపస్‌లో యువకులకు, సిరిసిల్లలో యువతులకు శిక్షణ అందిస్తున్నట్లు పేర్కొన్నారు. మూడు నెలల ఉచిత శిక్షణతోపాటు వసతి, భోజనం, ఇతర సౌకర్యాలు కల్పించనున్న ట్లు తెలిపారు. ఆసక్తి గల వారు ఆధార్‌కార్డు, విద్యార్హత పత్రాలతో ఈ నెల 14న జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్‌లో నిర్వహించే జాబ్‌మేళాకు హాజరు కావా లని సూచించారు. వివరాలకు 99592 80252, 89198 90976 నంబర్లలో సంప్రదించాలన్నారు.

Published date : 13 Sep 2023 07:46AM

Photo Stories