February 8th Schools, Colleges, Office Holiday : ఫిబ్రవరి 8వ తేదీన స్కూల్స్, కాలేజీలు, ఆఫీస్‌లకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం.. కారణం ఇదే..! అలాగే మరో మూడు రోజులు కూడా..
కానీ ఇది ఐచ్ఛిక సెలవు కింద పేర్కొనబడింది. సాధారణ సెలవుగా చేర్చబడింది. ఇప్పుడు సాధారణ సెలవు దినంగా మారింది. షబ్-ఎ-మెరాజ్ ముస్లింలు పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఆ రోజు ఈ పర్వానా మసీదులను దీపాలతో అలంకరిస్తారు. రాత్రంతా జాగారం చేసి ప్రార్థనలు చేస్తారు. ఫిబ్రవరి 8న (గురువారం) సాధారణ సెలవు దినం కావడంతో ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలకు సెలవును ప్రకటించారు. కానీ ఫిబ్రవరిలో సాధారణ సెలవులు లేవు.
ఆంధ్రప్రదేశ్‌లో..?
అలాగే ఆంధ్రప్రదేశ్‌లో ఫిబ్రవరి 8వ తేదీన (గురువారం) స్కూల్స్, కాలేజీలకు, ఆఫీసులకు సెలవు ఇచ్చే అవకాశం ఉంది. దీనిపై ఏపీ ప్రభుత్వం ఇంకా అధికారికంగా ప్రకటన చేయలేదు.
మరో మూడు రోజులు వరుసగా సెలవులు..
సాధారణ పండుగలు జనవరి తరువాత మార్చిలో ఉంటాయి. ప్రభుత్వం విడుదల చేసిన సెలవుల క్యాలెండర్ ప్రకారం, మహా శివరాత్రి సందర్భంగా మార్చి 8న సెలవు ఉంది. ప్రభుత్వ విడుదల చేసిన సెలవుల క్యాలెండర్ ప్రకారం మార్చి 8న మహా శివరాత్రి సందర్భంగా సెలవు ఉంది. మార్చి 25 హోలీ హాలీ డే ఉంది. మార్చి 29 గుడ్ ఫ్రైడే సందర్భగా సెలవు ఇచ్చారు.
Also Read : AP-10th-class timetable-2024
ఏప్రిల్ 5న బాబు జగ్జీవన్ రామ్ జయింతి సందర్భంగా హాలీడే డిక్లెర్ చేశారు. ఏప్రిల్ 9 ఉగాది సెలవు ఉంది. ఏప్రిల్ 11,12న రంజాన్ సెలవు ప్రకటించారు. ఏప్రిల్ 14న అంబేడ్కర్ జయంతి సందర్భంగా హాలీడే ఉంది. ఏప్రిల్ 17 శ్రీరామనవమికి కూడా సెలవు ఇచ్చారు.
☛ SSC 10th Class Public Exams 2024: ఒత్తిడి తగ్గించేందుకు... పరీక్షల విధానంలో పలు మార్పులు!!
జూన్ 17 బక్రిద్ సెలవు ఉంది. జులై 17న మెహర్రం హాలీడే ఉంది. జులై 29న బోనాల సందర్భంగా సెలవు ప్రకటించారు. ఆగస్ట్ 15 ఇండిపెండెన్స్ డే హాలీ డే ఉంది. ఆగస్ట్ 26 శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా సెలవు ఇచ్చారు. సెప్టెంబర్ 7న వినాయక చవితి హాలీ డే ఉంది.సెప్టెంబర్ 16 ఇద్ నబీ కి సెలవు ఇచ్చారు. అక్టోబర్ 2న మహత్మ గాంధీ జయంతి సందర్బంగా సెలవు ఉంటుంది. అక్టోబర్ 12, 13 దసరా సెలవులు ఉండనున్నాయి. అక్టోబర్ 31 దీపావళి హాలీ డే ఉంది. నవంబర్ 15 గురు ననాక్ జయింతి సందర్భంగా సెలవు ఉంది. డిసెంబర్ 25, 26 క్రిస్ మస్ సెలవులు ఉన్నాయి.
Also Read : AP 10th Class Study Material
2024లో సెలవులు వివరాలు ఇవే..
☛ 26-01-2024 (శుక్రవారం) రిపబ్లిక్ డే
☛ 08-03-2024 (శుక్రవారం) మహాశివరాత్రి
☛ 25-03-2024 (సోమవారం) హోలీ
☛ 29-03-2024 (శుక్రవారం) గుడ్ ఫ్రైడే
☛ 05-04-2024 (శుక్రవారం) (బాబు జగ్జీవన్ రామ్ జయంతి)
☛ 09-04-2024 (మంగళవారం) ఉగాది
☛ 11-04-2024 (గురువారం) ఈద్ ఉల్ ఫితర్
☛ 17-04-2024 (బుధవారం) శ్రీరామనవమి
☛ 17-06-2024 (సోమవారం) బక్రీద్
☛ 17-07-2024 (బుధవారం) మొహర్రం
☛ 15-08-2024 (గురువారం) స్వాతంత్ర్య దినోత్సవం
☛ 26-08-2024 (సోమవారం) శ్రీ కృష్ణాష్టమి
☛07-09-2024 (శనివారం) వినాయకచవితి
☛ 16-09-2024 (సోమవారం) ఈద్ మిలాద్ ఉన్ నబి
☛ 02-10-2024 (బుధవారం) గాంధీ జయంతి
☛ 11-10-2024 (శుక్రవారం) దుర్గాష్టమి
☛ 31-10-2024 (గురువారం) దీపావళి
☛ 25-12-2024 (బుధవారం) క్రిస్మస్
బ్యాంకులకు భారీగా సెలవులు..
2024 ఫిబ్రవరి నెలలో బ్యాంకులకు భారీగా సెలవులు రానున్నాయి. ఫిబ్రవరిలో ఈ ఏడాది 29 రోజులు ఉన్నాయి. అందులో 18 రోజుల పాటు మాత్రమే బ్యాంకులు పని చేస్తాయి. అలాగే స్కూల్స్, కాలేజీల విద్యార్థులకు ఈ ఫిబ్రవరి నెలలో నిరాశ తప్పదు.
ఈ నెలలో శనివారం, ఆదివారాలు కాకుండా... కేవలం ఒక్క రోజు మాత్రమే స్కూల్స్, కాలేజీలకు సెలవు వచ్చే అవకాశం ఉంది. ఫిబ్రవరి 16వ తేదీ (శుక్రవారం) రథ సప్తమి సందర్భంగా స్కూల్స్, కాలేజీలకు సెలవు ఇచ్చే అవకాశం ఉంది. అంతే కానీ ఈ ఫిబ్రవరి నెలలో ఎటు వంటి పండగ సెలవులు లేవు. అలాగే ఏదన్నా అనుకోని బంద్‌లు.. మొదలైన వాటికి సెలవులు వచ్చే అవకాశం ఉంది. తాజాగా ఫిబ్రవరి 8వ తేదీన (గురువారం) తెలంగాణ ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించడంతో స్కూల్స్, కాలేజీలకు ఈ రోజు సెలవు రానున్నది.
బ్యాంకు లావాదేవీలు తరుచుగా నిర్వహించే వారికి బిగ్ అలర్ట్. ఫిబ్రవరిలో ఈ ఏడాది 29 రోజులు ఉన్నాయి. అయితే, అందులో 18 రోజుల పాటు మాత్రమే బ్యాంకులు పని చేస్తాయి. మిగిలిన 11 రోజులు బ్యాంకులు మూసి ఉంటాయి. ఇందులో సాధారణ సెలవులతో పాటు పండుగలు, నేషనల్ హాలీడేస్, స్థానిక సెలవులు ఉంటాయి. అలాగే ఆదివారంతో పాటు రెండో, నాలుగో శనివారాలు బ్యాంకులు బంద్ ఉంటాయి. ఇప్పటికే ఫిబ్రవరి నెలకు సంబంధించిన బ్యాంకుల సెలవుల జాబితాను విడుదల చేసింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. బ్యాంకుకు వెళ్లి పూర్తి చేయాల్సిన పనులు ఉన్న వారు తప్పనిసరిగా ఈ సెలవుల గురించి తెలుసుకోవడం మంచిది. లేదంటే తర్వాత ఇబ్బందులు పడాల్సి వస్తుంది.
బ్యాంకులకు సెలవులు ఉన్నప్పటికీ వివిధ రకాల బ్యాంకింగ్ సేవలు కొనసాగుతాయి. ఇంటర్నెట బ్యాంకింగ్, యూపీఐ, మొబైల్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ సర్వీసెస్ ద్వారా ట్రాన్సాక్షన్లు పూర్తి చేయవచ్చు. ఆన్‌లైన్ మోడ్ ద్వారా బ్యాంకులు మూసి ఉన్నప్పటికీ లావాదేవీలు నిర్వహించవచ్చు.
ఫిబ్రవరి నెలలో సెలవుల లిస్ట్ ఇదే..
➤ ఫిబ్రవరి 4వ తేదీ 2024 : ఫిబ్రవరి 4వ తేదీన ఆదివారం సందర్భంగా బ్యాంకులకు సాధారణ సెలవు ఉంటుంది.
➤ ఫిబ్రవరి 10వ తేదీ : ఈ తేదీన రెండవ శనివారం వస్తున్నందును దేశ వ్యాప్తంగా బ్యాంకులకు సాధారణ సెలవు ఉంటుంది.
➤ ఫిబ్రవరి 11వ తేదీ : ఈ రోజు ఆదివారం కాబట్టి బ్యాంకులు మూసి ఉంటాయి.
➤ ఫిబ్రవరి 14వ తేదీ : వసంత పంచమి, సరస్వతి పూజ సందర్భంగా త్రిపుర, ఒడిశా, పశ్చిమ బెంగాల్ లో బ్యాంకులకు సెలవు ఉంటుంది.
➤ ఫిబ్రవరి15వ తేదీ : ఈ రోజు నగై ని నది ఉత్సవాల సందర్భంగా మణిపూర్ లో బ్యాంకులు బంద్ ఉంటాయి.
➤ ఫిబ్రవరి 18వ తేదీ : ఈ రోజున ఆదివారం సందర్భంగా బ్యాంకులు మూసి ఉంటాయి.
➤ ఫిబ్రవరి 19వ తేదీ : ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సంతర్భంగా మహారాష్ట్రలో బ్యాంకులు బంద్ ఉంటాయి.
➤ ఫిబ్రవరి 20వ తేదీ : ఈ రోజున రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్ లో బ్యాంకులకు హాలీడే ఉంటుంది.
➤ ఫిబ్రవరి 24వ తేదీ : రెండో శనివారం సందర్భంగా దేశ వ్యాప్తంగా బ్యాంకులు మూసి ఉంటాయి.
➤ ఫిబ్రవరి 25వ తేదీ : ఆదివారం కాబట్టి బ్యాంకులకు సాధారణ సెలవు ఉంటుంది.
➤ ఫిబ్రవరి 26వ తేదీ : న్యోకుమ్ కారణంగా అరుణాచల్ ప్రదేశ్‌లో బ్యాంకులకు సెలవు ఉంటుంది.
Tags
- Holiday on 8th February 2024
- Holiday on 8th February 2024 News in Telugu
- February 8th Schools and Colleges News in Telugu
- Telangana February 8th Schools and Colleges News in Telugu
- february 8th holiday news telugu
- February Month 2024 Holidays Details News
- february month 2024 holidays for schools
- february month 2024 holidays for colleges
- february month 2024 holidays for colleges in telugu
- february 8th holiday for schools
- february 8th holiday for colleges
- february 8th holiday for office
- february 8th holiday for colleges news telugu
- february 8th holiday for schools news telugu
- GovernmentDecision
- TelanganaGovernment
- MuslimFestival
- sakshieducation latest news