Free training computer software Course: కంప్యూటర్ సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్‌లో ఉచిత శిక్షణ
రాష్ట్ర ప్రభుత్వం రామగిరిలో ఏర్పాటు చేసిన స్కిల్ కాలేజ్‌లో నిరుద్యోగ యువతకు ఉచితంగా నైపుణ్యాభివృద్ధి శిక్షణతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు స్కిల్ కాలేజ్ మేనేజర్ నాగేంద్రబాబు ఓ ప్రకటనలో తెలిపారు.
ఏదైన డిగ్రీ, బీటెక్, డిప్లొమో చదువుకున్న నిరుద్యోగులు ఈనెల 8 నుంచి 13వ తేదీ వరకు ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకోవచ్చాన్నరు. 5జీ నెట్‌వర్క్, కంప్యూటర్ సాఫ్ట్‌వేర్, ఎంఎస్ ఆఫీస్, టాలీ, కంప్యూటర్ హార్డ్‌వేర్ తదితర కోర్సులను 6 నెలల పాటు ఉచితంగా శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు.
శిక్షణ సమయంలో ఉచిత భోజనం, వసతి సౌకర్యం కూడా కల్పిస్తామన్నారు. 6 నెలల శిక్షణ అనంతరం సర్టిఫికెట్‌తో పాటు వివిధ ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని తెలిపారు.
ఆసక్తి ఉన్న యువత రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న ఈ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు సెల్ నంబర్ 7386143423 ను సంప్రదించాలన్నారు.
Tags
- Free training computer software Course
- Software Courses
- Free training
- Free training in courses
- free training program
- Hardware Engineering
- unemployed youth jobs
- Free Coaching
- Free Skill Training
- 5G Network
- Computer Software
- MS Office
- Free training in computer tally
- job opportunities
- Free Skill Development Training
- Unemployed Youth
- Sakshi Education Latest News