Free training: నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ
Sakshi Education

కడప కల్చరల్ : నిరుద్యోగ యువతకు టూరిజం, హాస్పిటాలిటీ అంశాలలో ఉచితంగా శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశం కల్పిస్తామని తిరుపతిలోని స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్/క్యాటరింగ్ టెక్నాలజీ, అప్‌లైడ్ న్యూట్రిషియన్ సంస్థ ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్.రమణప్రసాద్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ, సీ–డ్యాప్, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన సహకారంతో శిక్షణ ఉంటుందన్నారు. నాలుగు నెలలపాటు కిచెన్ సూపర్‌వైజర్ కోర్సు, మూడు నెలలపాటు రెస్టారెంట్ కెప్టెన్ కోర్సులలో శిక్షణ ఇస్తామన్నారు. దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులైన 30 మందికి ఈ శిక్షణ ఇస్తామన్నారు. వివరాలకు 9160912690 లేదా 91005 58006 నంబర్లలో సంప్రదించాలన్నారు.
Published date : 20 Sep 2023 01:01PM